ఇబ్బందులు సృష్టిస్తున్న మోడీ..

సంస్కరణల పేరిట సంచలనాలు, ఇబ్బందులు సృష్టిస్తున్న మోడీజీ మరో కోరిక కోరారు. ఈ నిర్ణయాన్ని మన్ కీ బాత్ లో చెప్పడంతో వెంటనే ఆయా సంస్థలు అమల్లో పెట్టాయి. ఈ నిర్ణయం కనుక అమలైతే జనాలకు ఇబ్బందులు తప్పవు..

మోడీ ఇటీవల మన్ కీ బాత్ లో ఇంధనాన్ని ఆదా చేయాలని పిలుపునిచ్చారు.  ఈ పిలుపును పురస్కరించుకొని తాము ఆదివారాలు బంద్ పాటిస్తామని భారత్ పెట్రోలియం డీలర్ల సమాఖ్య కార్యవర్గ సభ్యులు ప్రకటించారు. దీంతో ఈ వారం నుంచి ఏపీ , తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో ఆదివారం పూట 24 గంటల పాటు బంకులు పనిచేయవని వారు చెప్పారు.

ఈ నిర్ణయం 8 రాష్ట్రాల్లో అమలు కానుంది. సుమారు 20వేల బంకులు ఆదివారం పనిచేయవు.  ఆదివారం ఒక్కరోజు బంద్ వల్ల దాదాపు 150 కోట్ల నష్టం వస్తుందని.. కానీ ప్రధాని కోరిక మేరకు పెట్రోల్ బంకులు బంద్ చేయక తప్పడం లేదని పెట్రోల్ బంక్ నిర్వాహకుల సంఘం వారు చెబుతున్నారు.

To Top

Send this to a friend