నన్నుపిచ్చోన్ని చేస్తాడు..

దర్శకుడు’ అనే సినిమా ఆడియో ఫంక్షన్ కు వచ్చిన అల్లు అర్జున్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమాను దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారి కొత్త దర్శకుడితో తీశాడు. ఆ సినిమా ఆడియోలో మాట్లాడిన అల్లు అర్జున్ మాటలు వివాదాస్పమయ్యాయి. అల్లు అర్జున్ మాట్లాడుతూ సుకుమార్ దర్శకుడిగా ఫుల్ ఫాంలో ఉండి రిస్క్ చేస్తూ నిర్మాతగా సినిమాలు తీస్తున్నాడని.. ‘దర్శకుడు’ సినిమా హిట్ అవుతుందనే నమ్మకముందని చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్..

ఇక ఆతర్వాత తాను, సుకుమార్ కలిసి ఆర్య3 సినిమా చేయబోతున్నారా అనే ప్రశ్నకు సమాధానమిచ్చారు. సుకుమార్ తో కలిసి ఆర్య3 సినిమాలో నటించాలంటే కష్టమేనంటున్నాడు అల్లు అర్జున్..‘దర్శకుడు’ అనే సినిమా ఆడియోలాంచ్ లో పాల్గొన్న సందర్భంగా మాట్లాడిన అల్లు అర్జున్ ఆర్య3 పై క్లారిటీ ఇచ్చాడు..

మంచి కథ దొరికితే సుకుమార్ తో కలిసి సినిమా చేస్తానని. అయితే అది ఆర్య సినిమా మాత్రం కాదన్నారు.. ఆర్య సినిమాలోని క్యారెక్టర్ కు కొంచెం తిక్క ఉంటుంది.. ఆర్య2 సినిమాలోని క్యారెక్టర్ కు ఇంకాస్తా క్రాక్ ఉంటుంది.. ఇక ఆర్య3లో క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఆలోచించుకోవడానికే భయం వేస్తోంది.. ఇంచుముంచు అది పిచ్చి క్యారెక్టరే అవుతుంది.. అలాంటి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని తాను భావించడం లేదు.. అందుకే ఆర్య కాకుండా మంచి కథ దొరికతే సుకుమార్ తో చేస్తా.. కానీ ఆర్య మాత్రం చేయనని చెప్పేశాడు..

To Top

Send this to a friend