ఆ హీరోల కోసం ఏదైనా చేస్తుందట..

కాజల్ అగర్వాల్.. తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. దాదాపు చిరంజీవి నుంచి మొదలుపెడితే మహేశ్, ఎన్టీఆర్ , రాంచరణ్, అల్లు అర్జున్ సహా చాలా టాప్ హీరోలతో చేసింది. ఇప్పుడు గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది.. ఇన్నేళ్ల తెలుగు ఇండస్ట్రీలో తనకు ఇద్దరు క్లోజ్ హీరోలు ఫ్రెండ్స్ గా ఉన్నారని వారు ఏం అడిగినా తాను చేయడానికి రెడీ అంటోంది కాజల్.. ఆ హీరోలు అడిగిన కొన్ని కోర్కెలు కూడా తీర్చానని చెబుతోంది..

తెలుగు ఇండస్ట్రీలో తనకు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారని కాజల్ అంటోంది. ప్రొఫెషనల్ గా, సింపుల్ గా, గౌరవ మర్యాదలు ఇచ్చే హీరోలు ప్రభాస్, ఎన్టీఆర్ అని.. వారి నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని కాజల్ చెప్పింది. ప్రభాస్ కామ్ అండ్ కూల్ అని.. తన పని తాను ఎంతో నియమ నిష్టలతో చేసుకుపోతుంటాడని.. బయట మీడియా వార్తలను గాసిప్ లను, పట్టించుకోడని.. ఇంట్లో ఎలా ఉంటాడో, సెట్లో కూడా అలానే ఉంటాడని స్పష్టం చేశారు. మిస్టర్ ఫర్ ఫెక్ట్ సినిమాలో ప్రభాస్ అడిగిన చిన్న చిన్న పనులు చేసి అతడి తో శభాష్ అనిపించుకున్నానని కాజల్ చెప్పింది.

తెలుగు హీరోల్లో మిస్టర్ ఫర్ ఫెక్ట్ గా నటనలో, డ్యాన్సుల్లో ఇరగదీసే ఎన్టీఆర్ అంటే తనకు చాలా అభిమానమని.. తనకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని కాజల్ చెప్పింది. జనతా గ్యారేజ్ కోసం ఐటం సాంగ్ చేయమని ఎన్టీఆర్ కోరగానే చేశానని.. ఎన్టీఆర్ అడిగితే తాను ఏం చేయడానికైనా రెడీ అని కాజల్ స్పష్టం చేసింది. తనకు తెలుగులో ఎన్టీఆర్, ప్రభాస్ క్లోజ్ అని మరోసారి పునరుద్ఘాటించింది.

To Top

Send this to a friend