మా ఇంట్లో నేను తప్పుగా పుట్టాను : కాజల్‌

టాలీవుడ్‌, కోలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌గా గత దశాబ్ద కాలంగా వెలుగు వెలుగుతూ వస్తున్న ముద్దుగ్ము కాజల్‌ ప్రస్తుతం రానా సరసన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాతో పాటు మరో రెండు సినిమాలకు కూడా ఈ అమ్మడు కమిట్‌ అయినట్లుగా తెలుస్తోంది. ఈ అమ్మడు నార్త్‌ ఇండియాకు చెందిన కుటుంబంలో జన్మించిన విషయం తెల్సిందే. అయితే ఈమె నార్త్‌ ఇండియాలో పుట్టి పెరిగినా కూడా చిన్నప్పటి నుండి సౌత్‌ ఇండియాతో ఉన్న సంబంధం వల్ల తన సొంత ప్రదేశంగా సౌత్‌ ఇండియానే కాజల్‌ చెప్పుకుంటుందట.

తాజాగా ఈ అమ్మడు ఈ విషయమై మాట్లాడుతూ తనకు సౌత్‌ ఇండియా అంటే చాలా అభిమానం అని పేర్కొంది. మా ఇంట్లో నేను తప్పుగా పుట్టాను, నేను సౌత్‌లో పుట్టాల్సిందంటూ చెప్పుకొచ్చింది. తన కుటుంబ సభ్యులు కూడా అదే విషయాన్ని పదే పదే అంటూ ఉంటారు అంటూ చెప్పుకొచ్చింది. నాకు బాలీవుడ్‌ నుండి ఆఫర్లు వస్తున్నాయి. కాని నాకు తెలుగు మరియు తమిళ సినీ పరిశ్రమలు అంటేనే ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది.

ఇటీవల కాస్త ఆఫర్లు తగ్గుతున్న ఈ అమ్మడు ఇలా మాటల గారడి చేసి సౌత్‌ సినీ ప్రేక్షకుల దృష్టిని తనవైపుకు మరల్చుకుని మళ్లీ సౌత్‌లో హీరోయిన్‌గా వరుస ఆఫర్లు దక్కించుకోవాలని భావిస్తుంది. ఎక్కడ పెరిగినా కూడా పుట్టిన ప్రదేశంను గౌరవించడం పద్దతి. కాని సౌత్‌ అంటే ఇష్టం, నార్త్‌ అంటే కష్టం అంటూ కాజల్‌ చేసిన వ్యాఖ్యలు విమర్శల పాలవుతున్నాయి.

To Top

Send this to a friend