కోలీవుడ్, టాలీవుడ్లో సుచి లీక్స్ సృష్టించిన ప్రకంపనలు అంతా ఇంతా కావు. అసలు సుచిత్ర ఆ లీక్స్ చేసిందా లేదో తెలియదు. ఇక విడుదలైన ఫొటోలు మరియు వీడియోల్లో ఉన్నది నిజంగా వారేనా అనేది కూడా క్లారిటీ లేదు. అయినా కూడా తెలుగు మరియు తమిళ చిత్ర ప్రరిశ్రమలో మరియు మీడియాలో సుచిలీక్స్కు సంబంధించిన జరిగిన ప్రచారం, వచ్చిన వార్తలు అన్ని ఇన్నీ కావు. సుచిలీక్స్ పేరుతో కొందరు న్యూడ్ వీడియోలు ఇంకా ఇతరత్ర వీడియోలు కూడా లీక్ చేసిన విషయం తెల్సిందే.
సుచిలీక్స్ గురించి అంతా కూడా మర్చి పోతున్న సమయంలో మళ్లీ అమలాపాల్ మరోసారి ఆ విషయాన్ని గుర్తు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. సుచిలీక్స్ గురించి తాను ఎదురు చూస్తున్నాను అని, తన న్యూడ్ వీడియో ఏమైనా వస్తుందేమో అని ఎదురు చూశాను, ఇప్పటికి కూడా ఎదురు చూస్తున్నాను అన్నట్లుగా చెప్పుకొచ్చింది. తన ఫేస్‌ను మార్ఫింగ్ చేసి తన పేరు మీదో న్యూడ్ వీడియో విడుదల చేస్తారేమో అని ఆశించాను అన్నట్లుగా చెప్పుకొచ్చింది.
సుచిలీక్స్ విషయమై తాను ఎప్పుడు భయపడలేదు. తప్పు చేసిన వారు భయపడతారు, కాని నాకు ఏం సంబంధం అంటూ ఆమె పేర్కొంది. దర్శకుడు విజయ్ను పెళ్లి చేసుకుని ఆ తర్వాత విడాకులు కూడా తీసుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తమిళంలో ఒక సినిమాలో నటిస్తుంది. పబ్లిసిటీ కోసం సుచిలీక్స్ గురించి మళ్లీ ఈ అమ్మడు లేవనెత్తుతుందనే టాక్ వినిపిస్తుంది.
