తెలంగాణ రైతుల కోసం నేనున్నా..


మిర్చి ధాన్యం కొనుగోళ్లు, పత్తి , వరి ధాన్యం, ఇలా కేంద్రం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎఫ్సీఐ ద్వారా నడుస్తున్న కొనుగోలు కేంద్రాల్లో ఎప్పుడూ ఏదో లొల్లి.. ధాన్యం ఎక్కువైందంటూ కొనుగోళ్లు నిలిపివేత.. కొన్నా కూడా నెలవరకూ కూడా బిల్లులు రాని పరిస్థితి. దీంతో రైతాంగమంతా ఆందోళనతో ఉంది. అందుకే కేసీఆర్ ఈ పరిస్థితిని చూసి డేరింగ్ స్టెప్ వేశాడు.

రైతులకు ధాన్యం కొనుగోళ్ల డబ్బులను అప్పులు చేశాయనే సరే ఇవ్వాలని అధికారులకు ప్రకటన చేశారు. బ్యాంకుల్లో అప్పులు తీసుకొని రైతులకు వెంటనే ధాన్యం కొనుగోళ్లు జరపాలని సూచించారు. కేంద్ర ఎఫ్సీఐ డబ్బులు చెల్లించాక వాటిని తిరిగి బ్యాంకుల్లో జమ చేయాలని కేసీఆర్ ఆదేశించారు. ఈ నిర్ణయం వల్ల రైతులకు త్వరగా డబ్బు అందుతుంది. ప్రభుత్వంపై వ్యతిరేకత తగ్గుతుందని కేసీఆర్ ప్లాన్..

ఇప్పటికే ఖమ్మం మిర్చి రైతులను అరెస్ట్ చేసిన విషయంలో కేసీఆర్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. రైతులకు సంకెళ్లు అంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. ఆ విమర్శలు పోగొట్టుకోవడానికే ఎరువుల కోసం ఉచితంగా రైతులకు రూ.4వేలు ఇవ్వడానికి కేసీఆర్ ప్రకటన చేశారు. ఇప్పుడు రైతులు అమ్మిన ధాన్యానికి వెంటనే డబ్బులు చెల్లించేందుకు ఆదేశాలు ఇచ్చి రైతుల కోసం నేనున్నాని చాటిచెప్పాడు.

To Top

Send this to a friend