మెగా ఫ్యామిలీ నుండి హీరోలు ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు. ఎందరు వచ్చినా కూడా చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ల తర్వాతే అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారిద్దరి తర్వాత మెగా స్థానం ఎవరిది అనే విషయంలో గత కొన్ని సంవత్సరాలుగా వార్ జరుగుతూనే ఉంది. యువ మెగా చైర్ కోసం రామ్‌చరణ్, అల్లు అర్జున్‌ల మద్య తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. పైకి వీరిద్దరు కలిసి ఉన్నట్లుగానే అనిపించినా కూడా ఒకరి మీద ఒకరు పై చేయి సాధించేందుకు ఎప్పుడు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.
గత రెండు సంవత్సరాలుగా అల్లు అర్జున్ వరుసగా సక్సెస్‌లతో దూసుకు పోతున్నాడు. దాంతో మెగా ఫ్యాన్స్ యువ మెగా చైర్ అల్లు అర్జున్‌దే అంటున్నారు. చరణ్ రెండు సంవత్సరాల్లో కేవలం ‘ధృవ’ చిత్రం మాత్రమే సక్సెస్ సాధించింది. కాని బన్నీకి నాలుగు సక్సెస్‌లు దక్కాయి. అందుకే చరణ్ కంటే అల్లు అర్జున్ ముందంజలో ఉన్నాడు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
అదే విషయాన్ని అల్లు అర్జున్ కూడా తాజాగా చెప్పకనే చెప్పాడు. బన్నీ రేపు ‘డీజే’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘డీజే’ చిత్రం ప్రమోషన్లో భాగంగా ఈ సినిమాతో మరోసారి కొట్టబోతున్నాను అని, ఈ సినిమాతో మరోసారి తానేంటో నిరూపించుకోబోతున్నట్లుగా కాస్త గట్టిగానే అన్నాడు. ఆ మాటలు ఇండైరెక్ట్‌గా చరణ్‌ను ఉద్దేశించే అనేది కొందరి వాదన. చరణ్ కాస్త జాగ్రత్త పడకుంటే మరింతగా బన్నీ దూసుకు వెళ్లడం ఖాయం.
