అస‌లు నీటికి ఉన్న రుచి మ‌న‌కు ఎలా తెలుస్తుందో తెలుసా?

మానవ శరీరంలోని ప్రతీ అవయవం దేనిపని అది చేస్తుంది.. ఒక్కో దానికి ఒక్కో సామర్థ్యం ఉంటుంది. అందుకే ప్రపంచంలోనే మనిషిలాంటి అత్యాధునిక యంత్రం మరోటి లేదని ఎంతో మంతి శాస్త్రవేత్తలు చెబుతుంటారు. మనలోని ప్రతి ఒక్క అవయవం రహస్యాన్ని ఇప్పటికీ శాస్త్రవేత్తలు గుర్తించలేదు. మెదుడు పనితీరుపై ఇప్పటికీ అంతుచిక్కడం లేదు. అలాగే రుచులను గ్రహించే నాలుకపై కూడా ఇటీవల చేసిన ఓ పరిశోధనలో ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి.
తీపి, పులుపు, కారం, చేదు, వ‌గ‌రు, ఉప్పు… ఇలా ఆరు రుచుల‌ను మ‌న నాలుక‌పై ఉన్న రుచి క‌ళిక‌లు గుర్తిస్తాయి. అందుకే ఏ ఆహారాన్న‌యినా మ‌నం రుచి చూడ‌గ‌లం. అయితే అన్ని ఆహారాల‌కు ఉన్న‌ట్టే నీటికి కూడా రుచి ఉంటుంది. స‌ముద్ర‌పు నీరు ఉప్ప‌గా ఉంటుంది, మిన‌ర‌ల్ వాట‌ర్ కొంత తియ్య‌గా ఉంటుంది. స్వ‌చ్ఛ‌మైన నీటికి అస‌లు ఏ రుచీ ఉండ‌దు. అయితే అస‌లు నీటికి ఉన్న రుచి మ‌న‌కు ఎలా తెలుస్తుందో తెలుసా..? అది కూడా రుచి కళిక‌ల వ‌ల్లే సాధ్య‌మ‌వుతుంది. మ‌రి వాటిలో ఏ రుచికి చెందిన క‌ళిక‌లు నీటి రుచిని గుర్తిస్తాయి..? అంటే… అందుకు సైంటిస్టులు స‌మాధానం క‌నుగొన్నారు..!
అమెరికాలోని కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీకి చెందిన సైంటిస్టులు తాజాగా ఓ ప్ర‌యోగం చేశారు. అదేమిటంటే… వారు నీటి రుచి మ‌న‌కు ఎలా తెలుస్తుంది..? ఏయే రుచి క‌ళిక‌ల వ‌ల్ల మ‌నం నీటి రుచిని గుర్తించ‌గ‌లుగుతాం..? అనే అంశంపై ప్ర‌యోగం చేశారు. ఈ క్ర‌మంలో వారు ఆరు ర‌కాల రుచుల‌కు చెందిన క‌ళిక‌ల‌ను నాలుక‌పై నిరోధిస్తూ వెళ్లారు. అందుకు ఓ ప్ర‌త్యేక‌మైన కాంతిని నాలుక‌పై ప్ర‌సారం చేశారు. దీంతో తెలిసిందేమిటంటే… వ‌గ‌రు రుచిని గుర్తించే క‌ళిక‌లే నీటి రుచిని గుర్తిస్తాయ‌ని తెలుసుకున్నారు. ఆ రుచి క‌ళిక‌ల‌ను కాంతితో అడ్డుకున్న‌ప్పుడు నీటిని తాగితే ఆ నీటికి రుచి తెలియ‌లేద‌న్నారు. దీంతో వారు ఈ నిర్దార‌ణ‌కు వ‌చ్చారు..!
To Top

Send this to a friend