ప్లాస్టిక్ రైస్.. దీన్నే ఫేక్ రైస్ అని కూడా అంటారు. వీటిని చైనా లో తయారు చేసి వివిధ దేశాలకు పంపిస్తున్నారు. ఇండియా, సింగపూర్, ఇండోనేషియా, శ్రీలంక లాంటి దేశాలు ఈ ప్లాస్టిక్ రైస్ భారిన పడుతున్నాయి. సాధారణంగా బియ్యాన్ని చూసి అది ప్లాస్టిక్ బియ్యమా.. లేదా నిజమైన బియ్యమా అని తెలుసుకోవడం చాలా కష్టం. ప్లాస్టిక్ రైస్ తింటే చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఎందుకంటే.. ప్లాస్టిక్ ను కెమికల్స్ తో తయారుచేస్తారు. ఇండియాలో నిజమైన బియ్యంలో ప్లాస్టిక్ రైస్ ను కలిపి అమ్ముతున్న డీలర్స్ చాలా మందే ఉన్నారు. ప్లాస్టిక్ రైస్ ను హోటల్స్ లోనూ వడ్డిస్తున్న కథనాలు మనం చూస్తూనే ఉన్నాం. మరి.. ప్లాస్టిక్ రైస్ ను గుర్తించడం ఎలా? అనేదే ఇప్పుడు ప్రతి ఒక్కరి మదిలో మెదులుతున్న ప్రశ్న. కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అయితే.. సింపుల్ గా, ఇంట్లోనే ప్లాస్టిక్ రైస్ ను గుర్తించొచ్చు.
1. ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. అందులో బియ్యం గింజల్ని వేసి గ్లాస్ ను బాగా షేక్ చేయండి. కొంత సేపటికి ప్లాస్టిక్ బియ్యం గ్లాస్ పైకి వచ్చేస్తాయి. ఎందుకంటే ప్లాస్టిక్ నీళ్లలో మునగదు.
2. కొన్ని బియ్యపు గింజల్ని తీసుకొని వాటిని అగ్గిపుల్లతో కాల్చండి. అవి ప్లాస్టిక్ బియ్యం అయితే కనుక వెంటనే మీకు ప్లాస్టిక్ వాసన వస్తుంది.
3. కొన్ని బియ్యపు గింజల్ని ఉడకపెట్టండి. తర్వాత ఉడికిన బియ్యాన్ని తీసి గిన్నెలో పెట్టి రెండు మూడు రోజులు అలాగే ఉంచండి. ఒకవేళ అవి ప్లాస్టిక్ బియ్యం అయితే.. ఉడికిన అన్నం పాడవదు. అలాగే ఉంటుంది. ఎటువంటి ఫంగస్ దానికి సోకదు. ఎందుకంటే.. ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా, ఎన్నిరోజులైనా ప్లాస్టిక్ అలాగే ఉంటుంది.
4. వేడి వేడిగా ఉన్న నూనెలో కొన్ని బియ్యపు గింజలు వేయండి. అవి ప్లాస్టిక్ బియ్యం అయితే వెంటనే నూనె అడుగుబాగంలోకి చేరుకుంటాయి అవి.
5. అన్నం వండుతున్నప్పుడు కూడా ప్లాస్టిక్ బియ్యాన్ని గుర్తించొచ్చు. మీరు వండుతున్న అన్నం లో ప్లాస్టిక్ బియ్యం ఉంటే.. మీ గిన్న పైన చిక్కని ద్రవంలాగా పేరుకుపోతుంది
