హోటల్ బిల్- 20 కోట్లు చెల్లించిన ఏపీ ప్రభుత్వం .

 

అది ప్రభుత్వ సొమ్ము అయ్యా బాబు.. అలా అప్పనంగా ఖర్చు చేస్తే.. ఎలా..? సొంతిళ్లు కూలగొట్టి హోటల్ లో ఉంటున్న చంద్రబాబు.. ఆ బిల్లును ఏపీ ప్రభుత్వం ద్వారా కట్టడం వివాదాస్పదమైంది.. సాధారణంగా మీరు ఉన్న ఇల్లు పడకొట్టి కొత్త ఇల్లు కట్టుకొంటున్నారు , అప్పుడు ఏమి చేస్తారు ? సాధారణంగా ఎవరైనా సొంత ఇల్లు పూర్తయ్యేవరకు దగ్గర్లోని ఒక ఇల్లు అద్దెకి తీసుకొంటారు.
కానీ ప్రతివిషయంలో అవకాశాలు వెతుక్కొనే చంద్రబాబు కూడా అలాంటి అవకాశం వెతికి హోటల్ అద్దెకి తీసుకొన్నాడు. ఆ హోటల్ అద్దె ఎంతో తెలిస్తే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే .
ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు తీసుకొనే ప్రెసిడెంట్ సూట్ పార్క్ హయత్ లో తీసుకొన్నాడు . పార్క్ హయత్ లో ఉన్న మొత్తం మూడు ప్రెసిడెంట్ సూట్లు చంద్రబాబు అద్దెకి తీసుకొన్నాడు . ధనవంతులు కూడా ఇలాంటివి కేవలం ఒకటి రెండు రోజులకే అద్దెకి తీసుకొంటారు . విదేశాల నుండి వచ్చే దేశాధ్యక్షులు కానీ అలాంటి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే అలాంటి ఫైవ్ స్టార్ట్ లో ప్రెసిడెంట్ సూట్లు అద్దెకి తీసుకొంటారు .
అలాంటి సూట్లు చంద్రబాబు కుటుంబం నివసించటానికి అద్దెకు తీసుకొన్నారు .
ఒక్కో సూట్ ఒక్క రోజు అద్దె – 1,14,750
మొత్తం మూడు సూట్లు – 114750 *3 = 3,44,250.
రోజుకి అద్దె – అక్షరాలా 3 లక్షల 44 వేల 250 రూపాయలు .
నెలకి – 344250 * 30 = రూ.1,03,27,500
నెల అద్దె అక్షరాలా 1 కోటి 3 లక్షల 27 వేల 500 వందల రూపాయలు .
చంద్రబాబు కుటుంబం ఈ పార్క్ హయత్ హోటల్ కి 2016 మే నెలలో మారింది , ఇప్పటికీ అక్కడే కొనసాగుతుంది .
దాదాపుగా సంవత్సరం అవుతుంది , అనగా 12 నెలలు .
12 నెలల అద్దె చూద్దాం .
1,03,27,500 * 12 = రూ.12,39,30,000 .
ఆంటే ఇప్పటివరకూ చంద్రబాబు కుటుంబం కోసం ఆంధ్రప్రభుత్వం చెల్లించిన హోటల్ అద్దె అక్షరాలా 12 కోట్ల 39 లక్షల 30 వేల రూపాయలు .
ఇది కేవలం అక్కడ బాబు కుటుంబం ఉండటానికి ప్రభుత్వం చెల్లించిన అద్దె . దానికి ఫుడ్ బిల్ అదనం.
అక్కడ ఒక్కో కాఫీ 720 రూపాయలు , వాటర్ బాటిల్ 450 రూపాయలు . ఇంకా భోజనం అదనపు సౌకర్యాలు అన్నీ కలుపుకొంటే కుటుంబ సభ్యులకి , వచ్చి పోయే అతిధులకు , అక్కడ వీళ్ళ కోసం ఉండే సెక్యూరిటీ వాళ్లందరికి సంవత్సరానికి కనీసం ఇంకో 8 కోట్లు సులభంగా అయ్యుంటుంది .
తక్కువలో తక్కువ లెక్కలు వేసినా చంద్రబాబు ప్రభుత్వం ఒక్క సంవత్సరం కోసం ఆంద్రప్రభుత్వం చెల్లించింది 20 కోట్లు పైమాటే .

కొసమెరుపు :- నిన్ననే చంద్రబాబు వందలకోట్లు పెట్టి కట్టిన ఇల్లు సిద్ధం అయింది , ఎవరినీ పిలవకుండా అత్యంత రహస్యంగా గృహ ప్రవేశం చేశారు. ఇల్లు సిద్ధం అయ్యాక కూడా పార్క్ హయత్ హోటల్ ఖాళీ చేయలేదు .
తన వందల కోట్లు పెట్టి కట్టుకొన్న ఇల్లు రహస్యం బయటకి తెలిసిపోతుందేమోనని భయంతో ఇంకా రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు మీటింగ్లన్నీ పార్క్ హయత్ లోనే ఉండబోతున్నాయి . అందుకే మిగతా 2 సంవత్సరాలకి కూడా హోటల్ అద్దెలు తప్పవు , రహస్య మీటింగ్లు అంటే ఆ మాత్రం అద్దె చెల్లించాలి కదా..

To Top

Send this to a friend