హాట్ ఫొటోలు పెట్టి బుక్కయ్యింది..


అమలాపాల్.. వివాదంలో చిక్కుకున్నారు. ప్రధాని యోగా స్పూర్తితో యోగా చేసినా చేయాల్సిన చోట.. కాకుండా చేయకూడని చోట చేసి వివాదం కొని తెచ్చుకున్నారు. ఇటీవల ఆమె చేసిన తాజా యోగా ఫొటో షూట్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేయడంతో దానిపై వివాదం రేగింది.

అమలాపాల్ యోగాచేసిన గది గోడపై గౌతమ బుద్దుడి ప్రతిమ ఉంది. దానిపై అర్థనగ్నంగా అమలాపాల్ యోగా చేస్తూ కాళ్లు బుద్దిపై పెట్టింది. ఇది చాలా వివాదం అయ్యింది. అమలా బుద్ధుడిని అవమానించారని.. ఆ ఫొటోలను తొలగించి క్షమాపణలు చెప్పాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే అమల ఆ ఫొటోలను తొలగించి సారీ చెప్పాలని కోరుతున్నారు. కానీ అమల ఇవేవీ పట్టించుకోకుండా అలానే ఫొటోలను కొనసాగిస్తోంది.

అమలాపాల్ హీరోయిన్ టాప్ గా కొనసాగుతున్నప్పుడే చిన్న వయస్సులోనే డైరెక్టర్ విజయ్ ను పెళ్లాడింది. ఆ వెంటనే కొద్దిరోజులు సంసారం చేసి విడాకులు తీసుకుంది.. అనంతరం ఇప్పుడు సినిమాలు చేస్తోంది. పబ్లిసిటీ కోసమే ఆమె ఇలా హాట్ పిక్స్ తో యోగా చేసిందని.. బుద్ధుడిని అవమానించిదనే టాక్ వినిపిస్తోంది.

To Top

Send this to a friend