6 ఏళ్లు డేటింగ్‌ చేసిన హీరో?


టాలీవుడ్‌లో ఇలియాన ఓ రేంజ్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. చిన్న వయస్సులోనే తెలుగులో హీరోయిన్‌గా అవకాశం దక్కించుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్‌లో హీరోయిన్‌గా కొనసాగుతుంది. తెలుగులో పలు చిత్రాలు చేసి, స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నా కూడా బాలీవుడ్‌ నుండి ఆఫర్‌ రావడమే అక్కడకు వెళ్లి పోయింది. అక్కడ అడపా దడపా అవకాశాలు అందిపుచ్చుకుంటూ రాణిస్తూ ఉంది. గత కొన్నాళ్లుగా ఈ అమ్మడు ఒక ఇంగ్లీష్‌ వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇలియాన ఆ వ్యక్తిని వివాహం చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఇలియాన మాట్లాడుతూ తాను 15 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చాను. ఆ సమయంలో తనకు పెద్దగా అవగాహన ఉండేది కాదు. అప్పుడే తెలుగు హీరోతో డేటింగ్‌ చేశాను. ఆరు సంవత్సరాల పాటు ఆ హీరోతో తాను డేటింగ్‌ చేశాను అంటూ చెప్పుకొచ్చింది. ఆ హీరో ఎవరు అనే విషయాన్ని మాత్రం ఇలియాన వెల్లడి చేయలేదు.

ఇలియాన ‘దేవదాసు’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలువురు స్టార్‌ హీరోలతో సినిమాలు చేసింది. అంతే కాని తెలుగు లో ఆమె ఎవరితోనూ డేటింగ్‌ చేసినట్లుగా అప్పట్లో ప్రచారం జరగలేదు. కాస్త ఉంటే దాన్ని డబుల్‌ చేసే మీడియా ఇలియానా ఆరు సంవత్సరాలు డేటింగ్‌ చేస్తే మీడియాకు తెలియక పోయేదా అంటున్నారు. ఇలియాన పబ్లిసిటీ కోసం తాను ఆరు సంవత్సరాలు తెలుగు హీరోతో డేటింగ్‌ చేశాను అంటూ చెప్పుకొచ్చింది అని కొందరు ఎద్దేవ చేస్తున్నారు.

To Top

Send this to a friend