హిందీ చిత్రాల్లో దోపిడీ ఎక్కువట!!


తెలుగులో ఫేమస్ విలన్ ప్రదీప్ రావత్ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయటపెట్టాడు. తనకు తెలుగు సినిమా అంటే చాలా ఇష్టమని.. రాజమౌళి తన గాడ్ ఫాదర్ అని చెప్పుకొచ్చారు. సై సినిమా ద్వారా తెలుగులో విలన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రదీప్ అనంతరం తెలుగులో చాలా చిత్రాల్లో నటించారు. 1990 నుంచి హిందీ చిత్ర సీమలో నటిస్తున్న ప్రదీప్ రావత్ .. లగాన్ సినిమా లో చేసిన నటన చూసి రాజమౌళి తెలుగులో తీసిన సై చిత్రానికి ఎంపిక చేసుకున్నారు. ఇలా తెలుగులో ఇప్పుడు టాప్ విలన్ గా ప్రదీప్ ఓ వెలుగు వెలుగుతున్నాడు.

కాగా తెలుగులో రెమ్యునరేషన్ గౌరవం పరంగా చాలా మంచి మర్యాదలు పాటిస్తారని.. కానీ హిందీలో మాత్రం దోపిడీ ఎక్కువని తేల్చిచెప్పాడు. హిందీ సినిమాల్లో రోజూ షూటింగ్ లకు వెళ్లినా పారితోషికం సరిగ్గా ఇచ్చేవారు కాదని ప్రదీప్ వాపోయాడు. డబ్బు లేకుండానే కొన్ని సినిమాలు చేసి మోసపోయానన్నారు. ఇలా చేస్తేనే నీకు మంచి పేరు వస్తుందని.. దర్శక నిర్మాతలు నన్ను బుజ్జగించేవారని.. పనిమాత్రం బాగా చేయించుకునేవారన్నారన్నారు. హీందీ పేరు వచ్చాక ఓ రకంగా చూస్తారు.. పేరు రాకముందు దోపిడీ చేస్తారని చెప్పారు. ఈ దోపిడీ హిందీ చిత్రసీమలో ఎక్కువగా ఉందని.. తెలుగులో అలాంటిదేమీ లేదని చెప్పారు. అందుకే హిందీ తారలంతా తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలవైపు మొగ్గుచూపిస్తున్నారన్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలని కోరుకుంటున్నట్టు ప్రదీప్ రావత్ చెప్పుకొచ్చారు.

To Top

Send this to a friend