బిగ్ బాస్.. పెరిగిన ఎన్టీఆర్ పారితోషికం..

బిగ్ బాస్ షో కోసం ఎన్టీఆర్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడనే వార్తలు అంతటా వెలువడుతున్నాయి. ఎన్టీఆర్ కూడా షో మొదలైనప్పుడు ఇంటర్వ్యూలో తన రెమ్యునరేషన్ ఎంతనేది స్పందించాడు. నా భార్య బిడ్డలు బతికేంత మాత్రమే నేను తీసుకుంటున్నానని ప్రశ్నను దాటవేశాడు. అయితే ఇప్పుడు షో హిట్ కావడంతో మాటీవీ కూడా ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ పెంచినట్టు సమాచారం..

ఏమూహూర్తాన బిగ్ బాస్ షోలో ఎన్టీఆర్ అడుగుపెట్టాడో తెలియదు కానీ ఆ షోను రక్తికట్టిస్తున్నాడు. మాటీవీలో ఈ బిగ్ బాస్ షో గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఇది వరకు మీలో ఎవరు కోటీశ్వరుడు షోను నాగార్జున, చిరంజీవి నిర్వహించగా అంతగా ఆదరణ రాలేదు. కానీ ఎన్టీఆర్ తన వాక్చాతుర్యం, నటన ప్రతిభతో బిగ్ బాస్ ను హిట్ చేస్తున్నాడు..

ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ షో ఫస్ట్ షో చూశాక ఎన్టీఆర్ కు 100 కు 150 మార్కులు వేస్తున్నారు సినీ అనలిస్టులు.. మాటీవీ ఎన్టీఆర్ హోస్ట్ గా తీసుకొని సరైన నిర్ణయం తీసుకుందనే ప్రశంసలు దక్కుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్ బిగ్ బాస్ షోకు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.. ఎన్టీఆర్ కు బిగ్ బాస్ షో చేస్తున్నందుకు గాను ఒక్కో ఎపిసోడ్ కు భారీ మొత్తంలో పారితోషికం తీసుకుంటున్నట్టు తెలిసింది.

ఈ బిగ్ బాస్ షో క్రేజ్ రావడానికి కారణమైన ఎన్టీఆర్ ఆ మాత్రం ఇవ్వడం లో తప్పులేదని మాటీవీ వర్గాలు చెబుతున్నారు. ఎన్టీఆర్ బిగ్ బాస్ షో కోసం ఒక్కో ఎపిసోడ్ కు రూ.35 లక్షలు మాటీవీ చానల్ చెల్లిస్తోందట.. ఇది గతంలో మాటీవీ మీలో ఎవరు కోటీశ్వరుడు చేసిన నాగార్జున, చిరంజీవిలు చెల్లించిన మొత్తం కంటే కూడా ఎక్కువనట.. ఇప్పుడు సీనియర్ హీరోలు చిరు, నాగ్ లకు మించి ఎన్టీఆర్ కు మాటీవీ ఎక్కువ మొత్తం చెల్లించడం సంచలనంగా మారింది.

To Top

Send this to a friend