చీప్ రేట్ లో భారీ ఫీచర్ల ఫోన్..

స్మార్ట్ ఫోన్ కు బ్యాటరీయే ప్రదానం.. ఇప్పుడు ఉదయం పెడితే సాయంత్రానికి బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతోంది. అందుకే ఇప్పుడు 4వేల బ్యాటరీ సామర్థ్యం గల ఫోన్లకు తెగ డిమాండ్ ఎక్కువైపోయింది. ఈ భారీ బ్యాటరీ ఫోన్ల కోసం ఇప్పుడు జనం ఆన్ లైన్ , ఆఫ్ లైన్ మార్కెట్లలో వెతుకుతున్నారు..

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న దేశీయ మొబైల్ తయారీ సంస్థ ఇంటెక్స్ బడ్జెట్ ధరలో అన్ని ఫీచర్లు గల ఫోన్ ను ఆవిష్కరించింది. పైగా ఇది 4జీ సపోర్ట్ చేస్తుండడం విశేషం. 4000ఎంఏహెచ్ సామర్థ్యం గల ఈ ఫోన్ ధర రూ.5499 కావడం విశేషం. గోల్డ్, బ్లాక్ రంగుల్లో ప్రస్తుతం దీన్ని బుధవారం విడుదల చేశారు.

ఇంటెక్స్ ఆక్వా పవర్ 4 పేరుతో విడుదల చేసిన ఈ ఫోన్ లో 7.0 నోగట్ ఓఎస్ ను ఉపయోగించారు. 5 అంగుళాల డిస్ ప్లే, క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, ముందు వెనుక 5 మెగా పిక్సల్ కెమెరాలు, ఫ్లాష్, 16జీబీ అంతర్గత మెమొరీ, 128జీబీ వరకు జీబీ పెంచుకునే సదుపాయం ఈ ఫోన్ లో ఉంది. దీంతో వినియోగదారులు ఈ భారీ ఫీచర్ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారు.

To Top

Send this to a friend