డ్రగ్స్‌ వ్యవహారంలో కొందరిని కాపాడే ప్రయత్నం

టాలీవుడ్‌లో డ్రగ్స్‌ వ్యవహారం ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తుంది. స్టార్స్‌ కూడా ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లుగా తేలడంతో అంతా షాక్‌ అవుతున్నారు. ముఖ్యంగా రవితేజ, పూరి, ఛార్మి, చోటాకే నాయుడు, నందు, నవదీప్‌ వంటి వారు ఈ కేసులో నిందుతులుగా ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం. అయితే వీరు మాత్రమే కాకుండా ఇంకా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. వారి పేర్లను బయటకు రాకుండా రాజకీయ పెద్దలు ప్రయత్నాలు చేసి సఫలం అయినట్లుగా తెలుస్తోంది.

ఒక ప్రముఖ నిర్మాత తనయుడు ప్రస్తుతం టాలీవుడ్‌లో హీరోగా ఉన్నాడు. ఆయనకు డ్రగ్స్‌ వ్యవహారంతో సంబంధం ఉంది, ఆయన రెగ్యులర్‌గా డ్రగ్స్‌ తీసుకుంటాడు అనేది ప్రచారం. ఇక ఒక స్టార్‌ హీరో తమ్ముడు కూడా డ్రగ్స్‌ తీసుకుంటాడని, అయితే ఆయన పేరు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇలా ఇండస్ట్రీలో పెద్ద తలకాయలకు చెందిన కొందరు డ్రగ్స్‌ వ్యవహారంలో ఉన్నా కూడా వారికి పోలీసులు నోటీసులు ఇవ్వలేదు. ముందే వారి పేర్లను తొలగించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం నోటీసులు అందుకున్న వారిలో ఎంత మంది నిందితులుగా తేలుతారో చూడాలి.

To Top

Send this to a friend