ఓ జర్నలిస్టూ.. నీ గురించి కాస్త ఆలోచించుకో..

ఉరుకులు పరుగులు..కాలంతో పాటు పరుగు..పరుగుతో పాటు ఆలోచనలు. ఆ ఆలోచనలకు ఆచరణ రూపం. అదే జర్నలిజం..ఇదే జర్నో జీవితం. ఇంట్లో సమస్యలు చుట్టిముట్టినా తట్టుకుని సమాజంలో ఉన్న సమస్యలకే పరిష్కారం చూపించాలనే తపన. కనిపించిన ప్రతి దాంట్లో జర్నో కోణాన్ని వెతుక్కుంటాడు..రోజూ కామన్ పీపులా ఆలోచించి జర్నలిస్టు జర్నీ మొదలు పెడతాడు.

అందరి గురించి ఆలోచిస్తాడు..అందరికీ న్యాయం జరగాలి..పొద్దున లేస్తే జనం ఆవేదనలు వింటాడు..అర్థం చేసుకుంటున్నాడు. వాళ్లకు ఏదైనా పరిష్కారం చూపించాలనుకుంటాడు..అందరూ బాగుండాలనుకుంటాడు. అందరి బాగోగులు చూసుకుంటాడు..కానీ ఈ హడావుడిలో తన ఆరోగ్యం గురించి మరిచిపోతాడు..ఆరోగ్యం గురించి ఆలోచించే టైమ్ ఉండదు.టైమ్ ఉన్నా..ఆలోచించేలోపే మరో పిలుపు. గడియారం ముల్లు ఒకటి రెండు నుంచి పన్నెండుదాకా తిరిగితే..జర్నలిస్టు లోకం చుట్టు తిరుగుతాడు.

24 గంటలు అదే ధ్వాస..పేరుకు డ్యూటీ 8 గంటలే అయినా..బుర్ర మాత్రం నిద్రపోనంతవరకు సమాజం చుట్టే తిరుగుతుంది. ఎక్కడకి వెళ్లాలి..ఏ స్టోరీ పేలిపోతోంది..?బాస్ దగ్గర శభాష్ అనిపించుకోవాలంటే ఏలాంటి స్టోరీలు చేయాలి..?కళ్ల ముందు ఉన్న సమస్యలకు పరిష్కారం చూపించేలా ఎలా ప్రెజెంట్ చేయాలి..?స్పీడ్ రిపోర్టింగ్ లో పోటీని ఎలా తట్టుకుని నెగ్గాలి..? స్టోరీలో ఏ యాంగిల్ తీసుకోవాలి..? అని బుర్ర వేడెక్కిపోయేలా ఆలోచిస్తుంటాడు. ఇలా ఆలోచించి ఆలోచించి అనారోగ్యం కొని తెచ్చుకుంటాడు..తనకు తెలియకుండా స్లో పాయిజన్ బాడీ మొత్తం ఎక్కేస్తోంది.ఇలా అందరి గుండెచప్పుళ్లు వినే జర్నలిస్టులు..తమ గుండె గురించి ఆలోచించడం మానేశారు. ఫలితంగా ఎంతో మంది జర్నలిస్టుల గుండెలు ఆగిపోయాయి.

ఒక్కసారి ఇంట్లో నుంచి బయటకెళ్లిన రిపోర్టర్ ఏ అర్దరాత్రో ఇంటికొస్తాడు. ఇలా బయలుదేరే టైమ్ లో రాత్రి ప్రయాణాలు కూడా మరికొందరి ప్రాణాలు తీశాయి. రోడ్డు ప్రమాదాలు మృత్యువులా వెంటాడి కుటుంబాల్ని రోడ్డేన పడేశాయి. ఇంకొందరు అనారోగ్యంతో లోకం వీడారు. తెలంగాణ వచ్చాకే దాదాపు 150 మంది జర్నలిస్టులు చనిపోయారు.

నిండు నూరేళ్లు బతికాల్సినోళ్లు అయిదు పదుల వయస్సైనా దాటకముందే కుటుంబాలకు అన్యాయం చేసి వెళ్లిపోయారు.అందరి భద్రత గురించి ఆలోచించే జర్నో జీవి…తన గురించే తనే పట్టించుకోలేకపోతున్నాడు. ఏదో రోజు గడిస్తే చాలు..అనే టైపులోనే ఆలోచిస్తున్నాడు. ఫలితంగా సేవింగ్స్ లేక..సేవ్ చేసే వాళ్లు లేక జర్నలిస్టుల ఫ్యామిలీస్ కన్నీరెడుతున్నాయి.

ఆహా జర్నలిస్టు అంటే ఏం జీవితం.. భలే ఉంటోంది. ఎక్కడికెళ్లిన పనులు జరుగుతాయి. పైసలు మస్తు వస్తాయి. ఎవడైనా భయపడాల్సిందే అంటారు. ఇవన్నీ ఉత్త ముచ్చట్లే. ఇంకొందరు అంటారు జర్నలిస్టు అంటే లగ్జరీ లైఫ్.సంపాదన ఫుల్లు..ఎవడికి ఫోన్ కొట్టిన పైసాలు రాలుతాయని తెగ వాగేస్తుంటారు. కానీ జర్నలిస్టు జీవితం అంటే ఎన్ని కష్టాలుంటాయో వాళ్లకేం తెలుసు..అందరి కష్టాలు వినేటోడు..తమ కష్టాల్ని కడుపులో పెట్టుకుంటాడు. కష్టనష్టాన్ని తనే భరించి కుటుంబంతా సంతోషంగా ఉండాలనుకుంటాడు.అప్పు చేసైనా బతుకు బండిని లాగిస్తాడు.

ఉద్యోగ భద్రత లేని లైఫ్.చేసేది పేరుమోసిన కంపెనీనైనా,మామూలు సంస్థైనా ఇంతే. ఉద్యోగాన్ని కాపాడుకునేందుకు రోజు ఆలోచించాల్సిందే. లేదంటే ఎర్త్ పెట్టేడానికి కాచు కుర్చున్న నాలుగో కృష్ణులు ఎందరో..ఒకడి ఉద్యోగం పోతే వాడ్ని రోడ్డున పడుతుందన్న సోయి ఉండదు. తనకు పేరు కోసం ఇతరుల్ని బలి చేసేటోళ్లు మరికొందరు. ఇంకా కొందరు రెండు, మూడు నెలల వరకు జీతాలు అందక ఇబ్బుందులు పడేవారు. ఇలా ఇంటా బయటా ఎన్నో కష్టాలు.

* కొండంత ధైర్యాన్ని ఇస్తున్న తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి…
జర్నలిస్టు సంక్షేమం కోసం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి పనిచేస్తుంది. మూడేళ్లలో రూ.30 కోట్లు విడుదల చేసింది. ఈ ఏడాదిలో మరో 30 కోట్ల రూపాయలు బడ్జెట్ లో జర్నలిస్టు సంక్షేమ నిధికి కేటాయించారు. ఈ నిధి నుంచి ఇప్పటివరకు 101 మరణించిన జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు లక్షల రూపాయల చొప్పున కోటి లక్షరూపాయలు ఇచ్చారు. దీంతోపాటు నెలకు రూ.3000 చొప్పున వంద కుటుంబాలకు ఐదేళ్ల పాటు పెన్షన్ అందిస్తున్నారు. మరణించిన జర్నలిస్టు కుటుంబాల్లోని ఎల్ కేజీ నుంచి పదో తరగతి వరకు చదువుకుంటున్న మొత్తం 78 మంది విద్యార్థులకు నెలకు రూ..1000 చొప్పున ప్రతినెల రూ.78 వేలు చెల్లిస్తుంది. అనారోగ్యం కారణంగా పనిచేయని లేని 33 మంది జర్నలిస్టులకు రూ.50వేల చొప్పున 16 లక్షల 50 వేల రూపాయల్ని సంక్షేమ నిధి ద్వారా తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చెల్లించింది. ఇలా ఎన్నో సంకేమ కార్యక్రమాలను చేస్తూ జర్నలిస్టుల కుటుంబాలకు తోడునీడగా ఉంటోంది.

తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనే జర్నలిస్టులు చేయాల్సిన పనులివీ..

1.క్రమం తప్పకుండా రోజూ గంటపాటు వాకింగ్ చేయాలి.

2.టైమ్ ఉంటే జిమ్ కు వెళ్లాలి.

3. వీలున్నంత వరకు లేట్ నైట్ జర్నీల్ని తగ్గించుకోవాలి.

4. మందు కొట్టి డ్రైవింగ్ చేయడం పూర్తిగా మానేయాలి.

5. ఈ నగరానికే కాదు..ఈ జర్నలిస్టులకు ఏమైంది అన్న మాట అనించుకోకుండా స్మోకింగ్ ఆపేయాలి. ఒకే సారి మానేయలేకున్నా క్రమంగా వాటిని తగ్గిస్తూ రావాలి.వీలైతే పూర్తిగా బంద్ చేయాలి.

6 క్రమం తప్పకుండా హెల్త్ చెకప్ చేయించుకోవాలి.

7.పని హడావుడిలో వేళకు భోజనం చేయడం మర్చిపోవద్దు.

8.నిద్రలేమి లేకుండా చూసుకోవాలి. అస్తమానం సోషల్ మీడియా సైట్లు కూర్చొద్దు.

9.వారానికోసారైనా ఫ్యామిలీ తో వీకెండ్ పార్కింగ్ కు వెళ్లాలి.

10.దొరికిన టైమ్ ని ఫ్యామిలీతో ఖుషీగా గడిపేలా ప్లాన్ చేసుకోవాలి.

ఇలా చేస్తే కొంతకాలం ఆయువు గ్యారంటీ పెరుగుతోంది.గుండె పదిలంగా ఉంటుంది. అందరి గుండె చప్పుళ్లని వినొచ్చు..ఖుషీ ఖుషీగా రిపోర్టింగ్ చేస్తూ..ఫ్యామిలీతో ఆనందంగా గడిపేద్దాం

To Top

Send this to a friend