రెండవ సారి హీరోయిన్‌ ప్రేమ పెళ్లి

టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎన్నో చిత్రాల్లో నటించిన ముద్దుగుమ్మ అమలాపాల్‌ కొన్ని సంవత్సరాల క్రితం తమిళ దర్శకుడు విజయ్‌ను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. నాలుగు సంవత్సరాలు ప్రేమించుకున్న వీరిద్దరు కనీసం రెండు సంవత్సరాలు కూడా కలిసి జీవించలేక విడిపోయారు. చెన్నై ఫ్యామిలీ కోర్టులో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఒకరికి ఒకరు సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నారు.

ప్రస్తుతం తమిళంలో రెండు చిత్రాలు చేస్తున్న అమలాపాల్‌ మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన తనకు ఉందని, పెళ్లి చేసుకోకుండా సన్యాసిని మాదిరిగా మారాలనే కోరిక తనకేం లేదు అంటూ చెప్పుకొచ్చింది. అయితే రెండవ పెళ్లి కూడా ప్రేమ పెళ్లే అంటూ చెప్పుకొచ్చింది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం అమలా పాల్‌ ఒక తమిళ నటుడితో ప్రేమలో ఉన్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే అతడిని పెళ్లి చేసుకుంటుందనే టాక్‌ వినిపిస్తుంది.

మొదటి పెళ్లి విఫలం అయిన నేపథ్యంలో రెండవ పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ఈమె భావిస్తుంది. అందుకే తనను నచ్చినవాడు, తన అభిప్రాయాలను గౌరవించే వ్యక్తిని చేసుకోవాలని నిర్ణయించుకుంది. అందుకోసం ప్రేమించిన వ్యక్తి అయితే బాగుంటుందని ఆమె అభిప్రాయ పడతుంది.

To Top

Send this to a friend