కమెడియన్ తో హీరోయిన్ ఘాటు లిప్ లాక్ ?

ఈ మధ్య సినిమాల్లో లిప్ లాక్ సన్నివేశాలు కామన్ గా మారిపోయాయి. చాలా సినిమాల్లో ఈ తరహా లిప్ లాక్ సన్నివేశాలతో ప్రేక్షకులకు షాక్ ఇస్తున్నారు దర్శక నిర్మాతలు. తాజాగా ఓ కమెడియన్ తో హీరోయిన్ ఘాటు లిప్ లాక్ పెట్టి షాక్ ఇచ్చింది!! ఆ వివరాల్లోకి వెళితే .. జబర్దస్త్ షో ద్వారా కమెడియన్ గా పాపులర్ అయిన కిరాక్ ఆర్పీ తాజాగా పలు చిత్రాల్లో కమెడియన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే, అయన హీరోగా నటిస్తున్న ఇదేం దెయ్యం సినిమాలో ఈ సన్నివేశం జరిగింది !! ఆర్పీ సరసన హీరోయిన్ గా నటిస్తున్న రుచి ఓ సన్నివేశం డిమాండ్ మేరకు ఆర్పీ తో ఘాటు లిప్ లాక్ సన్నివేశంలో పాల్గొందట !! కిరాక్ ఆర్పీ, శ్రీనాధ్ మాగంటి, రచ్చ రవి లు హీరోలుగా వి రవివర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇదేం దెయ్యం. ముగ్గురు అమ్మాయిలు అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన ఈ సినిమా హర్రర్ కామెడీ నేపథ్యంలో రూపొందింది. మరి కిరాక్ ఆర్పీ పెట్టిన ఈ ఘాటు లిప్ లాక్ ఎలాంటి ఎఫెక్ట్ ఇస్తుందో చూడాలి?

To Top

Send this to a friend