హీరో సూర్య గొప్ప మనసు


హీరో సూర్య గొప్ప మనసు చాటుకున్నారు. తాను, తమ్ముడు , హీరో కార్తి పుట్టిపెరిగిన ఇళ్లును ఎలాంటి సెంటిమెంటుకు తావివ్వకుండా ఓ గొప్ప పనికోసం దానం చేశారు. అనాథ పిల్లల కోసం హీరో సూర్య నిర్వహిస్తున్న అగరం ఫౌండేషన్ కు సూర్య తన సొంత ఇంటిని దానం చేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు.

సూర్య తండ్రి శివకుమార్ కట్టిన ఇంట్లోనే చిన్నప్పుడు సూర్య, కార్తి మొత్తం కుటుంబం జీవించేది. హీరోగా సూర్య వెలుగు వెలిగిన తర్వాత ఓ పెద్ద ఇంట్లోకి కుటుంబాన్ని మార్చాడు. పాత ఇంటిని అలాగే వదిలేయదు. తాను అనాథ పిల్లల కోసం నిర్వహిస్తున్న అగరం ఫౌండేషన్ కు బుధవారం దానం చేశారు..

కాగా చైన్నై నడిబొడ్డున్న ఉన్న సూర్య పాత ఇళ్లు, స్థలం.. ప్రస్తుతం కోట్లు విలువచేస్తోంది. సూర్య ఇలా ఎలాంటి స్వలాభం చూసుకోకుండా అనాథలకు ఆశ్రయం కల్పించేందుకు పాత ఇంటిని ఇచ్చేయడం. వారికి స్వయంగా సూర్యనే ఉచితంగా చదువు, ఆశ్రయం కల్పిస్తుండడంతో ఆయనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

To Top

Send this to a friend