శ్రీకాంత్‌ను అలా చూడగలమా?


తెలుగు ప్రేక్షకులకు శ్రీకాంత్‌ ఒక ఫ్యామిలీ హీరోగా సుపరిచితుడు. అప్పుడప్పుడు కొన్ని చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేసినా కూడా శ్రీకాంత్‌ పాజిటివ్‌గానే చేశాడు. ఇప్పటి వరకు శ్రీకాంత్‌లో నెగటివ్‌ ఛాయల్లో చూడలేదు. ఫ్యామిలీ హీరోగా ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించిన శ్రీకాంత్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించేందుకు సిద్దం అవుతున్నాడు. ఇటీవ హీరోలుగా అవకాశాలు తగ్గిన వారు విలన్‌గా లేదా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ప్రయత్నాలు చేస్తున్నారు. వారిలో ముఖ్యంగా జగపతిబాబు గురించి చెప్పుకోవాలి.

హీరోగా ఎన్నో చిత్రాలు చేసి స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న జగపతిబాబు సెకండ్‌ ఇన్నింగ్స్‌ను ‘లెజెండ్‌’ చిత్రంతో ప్రారంభించాడు. ఆ సినిమాలో బాలయ్యతో ఢీ కొట్టే విలన్‌గా నటించాడు. ఆ సినిమాతో జగపతిబాబు సెకండ్‌ ఇన్నింగ్స్‌ సూపర్‌ హిట్‌ అయ్యింది. ఇప్పుడు అదే దారిలో శ్రీకాంత్‌ కూడా సెకండ్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇటీవలే మలయాళంలో ఒక చిత్రంలో విలన్‌గా నటించిన శ్రీకాంత్‌ తెలుగులో కూడా విలన్‌ వేశాలు వేసేందుకు సిద్దం అవుతున్నాడు.

బాలకృష్ణ హీరోగా ఏఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రంలో శ్రీకాంత్‌ విలన్‌గా నటించబోతున్నాడు. తెలుగు ప్రేక్షకులు ఇప్పటి వరకు శ్రీకాంత్‌ను సాఫ్ట్‌గానే చూశారు. మరి విలన్‌గా శ్రీకాంత్‌ను చూడగలమా అనేది చూడాలి. జగపతిబాబు కూడా ‘లెజెండ్‌’ ముందు వరకు కూడా సాఫ్ట్‌ పాత్రలు మరియు హీరో పాత్రలు మాత్రమే చేశాడు. అయినా కూడా విలన్‌గా ఆకట్టుకున్నాడు. శ్రీకాంత్‌ కూడా అలాగే ఆకట్టుకుంటాడేమో చూడాలి.

To Top

Send this to a friend