జనసేనలోకి శివాజీ?


శత్రువు, శత్రువు మిత్రులవుతున్నారు. అది 2014 మజిలీ ఎన్నికలు.. బీజేపీ కోసం ఇద్దరు హీరోలు చేతులు కలిపారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఒకరైతే, బీజేపీలో చేరి ఏపీకి న్యాయం జరుగుతుందని కలలు గన్న హీరో శివాజీ మరొకరు.. కానీ వారు కలలు కల్లలు కావడానికి ఎంతో సమయం పట్టలేదు. బీజేపీ మోసం చేసింది. ఏపీకి పవన్, శివాజీ డిమాండ్ చేసిన ప్రత్యేక హోదాను బీజేపీ ఇవ్వలేదు. అడకత్తెరలో పోకచెక్కలా చంద్రబాబు .. మోడీకే కొమ్ము కాస్తున్నాడు. దీంతో ఇప్పుడు జనసేనాని పవన్, శివాజీలు బీజేపీ-టీడీపీపై తిరుగుబావుటా ఎగురవేసి ఏపీ ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారు.

ఈ ఇద్దరు ఇప్పుడు కలిసి పనిచేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. జనసేనాని పవన్ కళ్యాణ్ .. శివాజీతో మాట్లాడారని.. గుంటూరు నుంచి ఎంపీగా జనసేన తరఫున పోటీచేయాలని కోరినట్టు తెలిసింది. రాజకీయంగా గుంటూరు కీలకం. రాజధానికి దగ్గరలోనిది. అక్కడ పవన్ కు ఉన్న బలం, శివాజీ స్టామినా తోడైతే గెలుపు గ్యారెంటీ అని పవన్.. శివాజీకీ ఈ ఆఫర్ ఇచ్చాడని తెలిసింది.

అయితే శివాజీ దీనిపై స్పందించలేదని తెలిసింది. ముందు పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా కోసం పోరాటాలకు సిద్ధమై ప్రజల్లోకి వస్తేనే ఆయన పార్టీ తరఫున పోటీచేస్తానని షరతు పెట్టినట్టు సమాచారం. హోదా కోసం పోరాడే ఏ పార్టీతోనైనా తాను కలిసి పోటీచేస్తానని శివాజీ చెప్పినట్టు తెలిసింది. ఈ లెక్కన 2019వరకు పవన్, శివాజీ కలిసిపోయి పోటీచేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

To Top

Send this to a friend