కుటుంబ విషయం.. వదిలేయండి


టాలీవుడ్‌ హీరో రవితేజ తమ్ముడు భరత్‌ కారు ప్రమాదంలో అత్యంత దారుణ పరిస్థితుల్లో మరణించాడు. దానికంటే దారుణ పరిస్థితి ఏంటి అంటే భరత్‌ అంత్యక్రియలు ఒక అనాధకు జరిగినట్లుగా జరిగాయి. కనీసం తల్లి, తండ్రి, అన్న ఏ ఒక్కరు కూడా భరత్‌ శవంను చూసేందుకు రాలేదు. దాంతో రవితేజపై తీవ్రమైన విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అంతా ఉన్నా కూడా ఒక అనాధలా ఎందుకు భరత్‌ను వదిలేశారు అంటూ సోషల్‌ మీడియాలో విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.

సోదరుడిని ఆ పరిస్థితుల్లో చూడలేకనే రవితేజ వెళ్లలేదు అని, అలాగే తల్లిదండ్రి కూడా భరత్‌ను చనిపోయి ఉండగా చూడలేమని అంత్యక్రియలకు హాజరు కాలేదు అని అంటున్నారు. ఆ మాట పూర్తిగా అవాస్తవం అని ప్రతి ఒక్కరు అంటున్నారు. భరత్‌పై కోపంతోనే రవితేజ మరియు అతడి తల్లిదండ్రులు వెళ్లలేదని, చనిపోయిన తర్వాత కూడా కోపం ఏంటి అంటూ సోషల్‌ మీడియాలో కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రవితేజ జీవితంలో పెద్ద తప్పు చేశాడు అంటూ ఆరోపిస్తున్నారు.

రవితేజపై వస్తున్న విమర్శలకు ఆ కుటుంబంకు సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తి స్పందించాడు. ఒక సెలబ్రెటీ అయినంత మాత్రాన వ్యక్తిగత అభిప్రాయాలు ఉండకూడదా. తనకు ఇష్టం వచ్చిన మాదిరిగా ప్రవర్తించే హక్కు సెలబ్రెటీలకు ఉండదా. తమ మనోభావాలు పక్కన పెట్టి మీడియా కోసం, జనాల కోసం ఇష్టం లేని పని చేయాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ విషయం వారి కుటుంబ విషయం, రవితేజ వ్యక్తిగత విషయం. మీడియా ఇప్పటికి అయినా ఆ విషయాన్ని వదిలేస్తే మంచిది అంటూ సున్నితంగా హెచ్చరించాడు. అప్పుడే రవితేజ షూటింగ్స్‌తో బిజీ అయ్యాడు. వారు అన్నా అనకున్నా ఒక వారం పది రోజులు ఈ హడావుడి సోషల్‌ మీడియాలో ఉంటుంది. ఆ తర్వాత అంతా సైలెంట్‌ అవుతుంది.

To Top

Send this to a friend