గత కొన్ని సంవత్సరాలుగా మీడియాలో రానా, త్రిషల విషయం గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. వీరిద్దరు ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోవాలని భావిస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే రానాను కాదని ఒక తమిళ నిర్మాతను త్రిష పెళ్లి చేసుకునేందుకు సిద్దం అయ్యి, ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. కాని ఆ పెళ్లి కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయ్యింది. ఆ తర్వాత రానా మరియు త్రిషలు కాస్త గ్యాప్ మెయింటెన్ చేస్తారని అంతా భావించారు.
ఎంగేజ్మెంట్ బ్రేకప్ అయిన తర్వాత మళ్లీ రానా, త్రిషలు అటు చెన్నైలో, ఇటు హైదరాబాద్‌లో సందడి చేస్తూనే ఉన్నారు. ఆ మద్య సుచిలీక్స్లో వీరిద్దరికి సంబంధించిన కొన్ని క్లోజ్ ఫొటోలు మీడియాలో సందడి చేశాయి. దాంతో త్రిష, రానాల మద్య సంబంధం ఉందని మరోసారి రుజువు అయ్యింది. కాని వీరిద్దరు మాత్రం మీడియాకు ఆ విషయం చెప్పకుండా తిరుగుతున్నారు. ఏమీ లేనట్లుగా మీడియా వద్ద ప్రవర్తిస్తున్నారు.
తాజాగా దుబాయిలో జరుగుతున్న సైమా అవార్డు వేడుకల్లో కూడా వీరిద్దరు కలిసి పాల్గొన్నారు. ఆ సమయంలో ఇద్దరు చాలా క్లోజ్‌గా కూర్చుని, మాట్లాడుతూ కనిపించారు. ఫంక్షన్ పూర్తి అయిన తర్వాత కూడా ఇద్దరు ఒకే కారులో హోటల్‌కు వెళ్లి పోయినట్లుగా అక్కడి వారు అంటున్నారు. మొత్తానికి రానా, త్రిషలు మీడియాలో మరోసారి సందడి చేస్తున్నారు. వీరిద్దరి మద్య ఏముందో తెలియక మీడియా వారు జుట్టు పీక్కుంటున్నారు.
