నాని.. ‘నిన్నుకోరి’ తప్పు చేశాడా.?

నాని.. ఇప్పుడు తెలుగులో దూసుకుపోతున్న కథానాయకుడు. నేచురల్ స్టార్ గా పేరు పొందాడు. వరుస విజయాలు సాధిస్తున్న నాని తీసిన సినిమా ‘నిన్నుకోరి’ ప్రస్తుతానికి ప్లాప్ అయితే కాలేదు. కానీ భారీ విజయాన్ని మాత్రం అందుకోలేదు. ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టిన నాని ఈ సినిమాతో విజయాల బాటలోనే నడిచాడు.

 

నిన్ను కోరి సినిమా ఎమోషనల్ మూవీ టాక్ తెచ్చుకుంది. కథ పరంగా ఏమీ లేదు. ప్రేమ కథా చిత్రంగా నిన్నుకోరి నిలిచిపోతుంది. ఎంటర్ టైన్ మెంట్ తో పాటు హృదయాలను కదిలించే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని సమాచారం. అయితే కథలో కానీ కథనంలో కానీ కొత్తదనం లేదని పలువురు పెదవి విరుస్తున్నారు.. మన చుట్టూ ఎన్నో జీవితాలు.. వారందరివీ ఎన్నో కథలు, వ్యథలు ప్రేమలు.. వాటన్నింటిని కథలు మలిస్తే.. జీవితాలను తెరకెక్కిస్తే ఎలా గుంటదో అలాంటి సినిమా ‘నిన్ను కోరి’.

 

వాస్తవ కథను ఆధారంగా చేసుకొని తీసిన సినిమా ఇది. ‘జెంటీల్ మాన్’ సినిమాతో హిట్ పెయిర్ గా నిలిచిన నాని, నివేదా థామస్ లు మరోసారి జంటగా నటించిన చిత్రమిది. అయితే ఇప్పటికే బెన్ ఫిట్ షోలతో ఈ సినిమా విదేశాల్లో రిలీజ్ అయ్యింది. దర్శకుడు కొత్త వాడైనా ఎక్కడా కన్ ఫ్యూజన్ లేకుండా, సింపుల్ గా ఎలాంటి తడబాటు లేకుండా తెరకెక్కించాడు. నాని నటన నేచుల్ గా ఉంది. ఇక కథలో చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. ఈ సినిమా పెద్ద హిట్ కాదు కానీ యవరేజ్ అనే టాక్ వినిపిస్తోంది.. దీంతో భారీ హిట్ లతో దూసుకుపోతున్న నాని ఈ సినిమాను ఒప్పుకొని తప్పు చేశాడా అని నాని అభిమానులు కలవరపడుతున్నారు.

To Top

Send this to a friend