పటేల్ సార్ గా జగపతిబాబు ఫస్ట్ లుక్ విడుదల !!


విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సూపర్ ఫామ్ లో ఉన్న జగపతిబాబు మళ్లీ హీరోగా అలరించేందుకు సన్నద్ధమవుతున్నారు. వారాహి చలనచిత్రం బ్యానర్ లో రజిని కొర్రపాటి నిర్మాణ సారథ్యంలో వాసు పరిమి దర్శకత్వం వహిస్తున్న స్టైలిష్ రివెంజ్ డ్రామా “పటేల్ సార్”. సాయి శివాని సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం నాడే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ టీజర్ ను విడుదల చేసి ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకొంది. 2.7 మిలియన్ వ్యూస్ సాధించిన “పటేల్ సార్” ఫస్ట్ లుక్ ను నేడు విడుదల చేసారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సాయి కొర్రపాటి మాట్లాడుతూ.. “యూట్యూబ్ లో విడుదల చేసిన టీజర్ తోనే “పటేల్ సార్” చిత్రం విశేషమైన క్రేజ్ ను సొంతం చేసుకొంది. జగపతిబాబు సహకారంతోనే ఈ చిత్రం షూటింగ్ సజావుగా సాగుతొంది. హాలీవుడ్ స్టాండర్డ్స్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి జగపతిబాబు యాక్షన్ సీక్వెన్స్ లు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. వాసు పరిమి టేకింగ్, కథ, స్క్రిప్ట్ ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తుంది. షూటింగ్ శరవేగంగా సాగుతొంది. సినిమాను జులై నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.
జగపతిబాబు, పద్మప్రియ, తాన్య హాప్, సుబ్బరాజు, పోసాని, రఘుబాబు, శుభలేఖ సుధాకర్, కబీర్ సింగ్, పృథ్వి, బేబీ డాలీ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి నృత్యాలు: సాగర్-రఘు, సాహిత్యం: బాలాజీ-రాము-వసంత్-రాంబాబు, పోరాటాలు: విజయ్-సతీష్-సొలొమాన్, ప్రోమోస్: భాస్కర్, పోస్టర్ డిజైన్: వెంకట్, ఎడిటింగ్: గౌతమ్ రాజు, డైలాగ్స్: ప్రకాష్, అడిషనల్ స్క్రీన్ ప్లే-స్క్రిప్ట్ కోఆర్డినేటర్: ఆర్.రాము, ఆర్ట్: కిరణ్, సంగీతం: వసంత్, ఛాయాగ్రహణం: శ్యామ్ కె.నాయుడు, బ్యానర్: వారాహి చలనచిత్రం, సమర్పణ: సాయి శివాని, నిర్మాణం: సాయి కొర్రపాటి, నిర్మాత: రజిని కొర్రపాటి, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: వాసు పరిమి!

To Top

Send this to a friend