టాలీవుడ్లో యంగ్ అండ్ ఎనర్జిటిక్ ట్యాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు `లవ్లీ` రాక్‌స్టార్ ఆది. గతేడాది `గరమ్`, `చుట్టాలబ్బాయి` చిత్రాల్లో నటించాడు. ఈ సంవత్సరం మరో క్రేజీ చిత్రంలో నటించనున్నాడు. ఈ చిత్రాన్ని యుఎస్ ప్రొడక్షన్స్- విజయలక్ష్మి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మాణంలో అమెరికాలో స్థిరపడిన ఎన్నారైలు చరణ్ తేజ్ ఉప్పలపాటి- విజయలక్ష్మి నిర్మిస్తున్నారు. విశ్వనాథ్ అరిగెల దర్శకత్వం వహిస్తున్నారు.
ఆది సరసన ఈ చిత్రంలో `యు-టర్న్` ఫేం, కన్నడ భామ శ్రద్ధా శ్రీనిధి కథానాయికగా నటిస్తోంది. ఏ.ఆర్.రెహమాన్ శిష్యుడు, `నీవే` మ్యూజికల్ వీడియో ఫేం ఫణి కల్యాణ్ సంగీతం అందిస్తున్నాడు. జూన్ రెండో వారంలో సినిమాని ప్రారంభించి మూడో వారంలో రెగ్యులర్ చిత్రీకరణకు వెళ్లనున్నారు. ఈ చిత్రానికి కెమెరా: దాసరథి శివేంద్ర, ఎడిటింగ్: రవి మన్ల, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రాఘవ చంద్ర.
