తాము అందుకు పనికి రామని ఛాన్స్‌లు ఇవ్వరు.

బాలీవుడ్‌ డ్రీమ్‌ గర్ల్‌ హేమామాలిని ఒకప్పుడు స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా ఉండేది. ఈమె డేట్ల కోసం ఎంతో మంది హీరోలు ఎదురు చూసేవారు. అలాంటి హేమ మాలిని ఇప్పుడు నటిస్తాను అంటూ చెబుతున్నా కూడా ఏ ఒక్క అవకాశం రావడం లేదు. వచ్చిన అడపా దడపా అవకాశాలు కూడా పెద్దగా ప్రాముఖ్యత లేని పాత్రలు దక్కుతున్నాయి. ఈ విషయమై తాజాగా ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూలో స్పందించి సంచలన వ్యాఖ్యలు చేసింది.

నిర్మాతలకు మరియు దర్శకులకు హీరోయిన్స్‌ మరియు నటీమనులు ఆ అవసరం తీర్చాల్సి ఉంటుంది. అందుకే కాస్త అందంగా, వయస్సు ఉన్న వారిని తీసుకుంటారు. ఇప్పుడు నేను ముసలి వయస్సుకు వచ్చాయి. అందుకే నాకు అవకాశాలు ఇవ్వరు. నాకే కాదు, నాలాంటి వారికి అవకాశం ఇచ్చేందుకు వారికి మనస్సు ఒప్పుకోదు. ఎందుకంటే వారికి మేము అందుకు పనికి రాము. వారి అవసరాలను తీర్చే వారే వారి సినిమాల్లో నటిస్తారు.

హేమ మాలిని చేసిన వ్యాఖ్యలే గత కొంత కాలంగా సౌత్‌లో కూడా వినిపిస్తున్నాయి. ఇటీవల రాయ్‌ లక్ష్మి అవకాశాలు కావాలి అంటే దర్శక నిర్మాతలకు బెడ్‌పై ఒక్కసారైనా అవకాశం ఇవ్వాల్సిందే అంటూ కామెంట్స్‌ చేసింది. ఇంకా పలువురు హీరోయిన్స్‌ అవకాశాల కోసం హీరోయిన్స్‌ పడకగదిలోకి వెళ్లాల్సి వస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు. తాజాగా అవే వ్యాఖ్యలు హేమ మాలిని చేయడంతో దాదాపు అన్ని భాషల సినీ పరిశ్రమల్లో ఇదే పరిస్థితి ఉందని వెళ్లడైంది. అయితే అందరు హీరోయిన్స్‌ అలాగే అవకాశాలు దక్కించుకున్నారు అనేది మాత్రం అవాస్తవం. కొందరికి మాత్రమే అలాంటి చెడ్డ అనుభవం ఎదురైందని చెప్పుకోవచ్చు.

To Top

Send this to a friend