చలపతిరావు వ్యాఖ్యల పై స్పందించిన నటి హేమ.

మహిళలపై ఎక్కడ ఏం జరిగినా సరే గొంతెత్తే నటి హేమ.. చలపతిరావు వ్యాఖ్యలపై కూడా స్పందించారు. అమ్మాయిుల పక్కలోకి పనికొస్తారని అని ఆ తర్వాత లెంపలేసుకున్న చలపతిరావును నాలుగు తిట్లు తిట్టి బాబాయ్ ఫ్లో లో అలా అనేశాడని.. మంచోడని సర్టిఫికెట్ ఇచ్చారామె.. కానీ చలపతిరావు పరువును మాత్రం తీసేసింది.

 

మా అసోసియేషన్ భవనంలో నిర్వహించిన సమావేశంలో నటి హేమ మాట్లాడారు. దాదాపు 5 నిమిషాలు మాట్లాడిన హేమ.. చలపతిరావు వ్యాఖ్యలపై ఖండించిందో, మెచ్చుకుందో అర్థంకాలేదు. ఆమె మహిళలకు సపోర్టుగా మాట్లాడిందా..? లేక చలపతిరావును సపోర్టు చేసిందా అర్థంకాక అక్కడికి వచ్చిన వారు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ప్రస్తుతం నటి హేమ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

హేమ చలపతిరావు వ్యాఖ్యలపై మొదట ఇలా మొదలుపెట్టారు.‘బాబాయ్ చలపతిరావ్ తప్పుడు మాటలు మాట్లాడాడు.. దీనిపై మహిళాలోకం స్పందించిన తీరు.. తనకు చాలా గర్వంగా ఉంది. ఇక నుంచి మహిళల గురించి మాట్లాడాలంటే ఎవరైనా భయపడాలి. చలపతిరావు బాబాయ్ కి ఇప్పుడు తప్పు తెలిసి వచ్చిందని’ మండిపడ్డారామె.. ఆ తర్వాత తేరుకొన్న హేమ ఈసారి సపోర్టుగా మాట్లాడింది.. ‘బాబాయ్ చలపతిరావ్ చాలా మంచోడు. ముప్పై ఏళ్ల నుంచి చూస్తున్నాం. ఆడవాళ్ల గురించి అనుచితంగా మాట్లాడినా.. ప్రవర్తించిన దాఖలాలు లేవు. ఆయన మీడియా ముందుకొచ్చి సారీ చెప్పాడు. ఆయనపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోండి.. ఈ వివాదాన్ని వదిలేయండి’ అని అందరినీ కోరింది. దీంతో హేమ చలపతిరావు వ్యాఖ్యలపై ఏం స్పందించిందో రాసుకోవడం విలేకరులకు తలకుమించిన భారమైందట..

నటి హేమ.. చలపతిరావుపై మాట్లాడిన వీడియోను కింద చూడొచ్చు..

To Top

Send this to a friend