బాబోయ్‌.. కుమారికి కోటి?


‘కుమారి 21ఎఫ్‌’ చిత్రంతో ప్రేక్షకులను అలరించి ఆ తర్వాత మూడు నాలుగు సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ హెబ్బా పటేల్‌. ఇటీవలే ఈమె ‘అంధగాడు’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలో రాజ్‌ తరుణ్‌కు జోడీగా నటించి మెప్పించింది. ఆ సినిమా సక్సెస్‌ అవ్వడంతో ఈమె క్రేజ్‌ పెరిగింది.

అయితే వరుసగా మూడు సంవత్సరాలుగా సినిమాలు చేస్తున్న తాను కాస్త బ్రేక్‌ తీసుకోవాలనుకుంటున్నట్లుగా ఆమద్య చెప్పుకొచ్చింది. అన్నట్లుగానే రెండు నెలల పాటు ఈ అమ్మడు సినిమాలన్నింటికి దూరంగా ఉంది. తాజాగా మళ్లీ సినిమాల్లో నటించేందుకు సిద్దం అవుతుంది. ఈ సమయంలోనే పారితోషికం విషయంలో ఈమె బాంబు పేల్చి అందరికి షాక్‌ ఇచ్చింది.

ఇప్పటి వరకు ఈమె నటించిన సినిమాలు అన్ని కూడా చిన్న స్థాయి సినిమాలే. 30 నుండి 50 లక్షల వరకు ఈమె పారితోషికం తీసుకుంది. కాని ఉన్నట్టుండి తన పారితోషికాన్ని ఏకంగా కోటి రూపాయలకు పెంచేసి నిర్మాతలకు షాక్‌ ఇస్తుంది. చిన్న నిర్మాతలు ఈమె పారితోషికంకు భయపడుతున్నారు. స్టార్‌ హీరోలతో నటించే హీరోయిన్స్‌ సైతం కోటికి లోపే పారితోషికం తీసుకుంటున్నారు. కాని ఈ అమ్మడు ఎందుకు కోటి పారితోషికంను ఫిక్స్‌ చేసింది అనేది ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. ఈమె ఫిక్స్‌ చేసినంత మాత్రాన అంత భారీ పారితోషికం ఈమెకు వస్తుందన్న నమ్మకం లేదు. కొన్ని రోజులు చూసి మళ్లీ పారితోషికంను తగ్గించుకుంటుందేమో చూడాలి.

To Top

Send this to a friend