40 ఏళ్లలోపు వారిలో పెరుగుతున్న హృద్రోగాలు..!


దేశంలో గుండెపోటుతో చనిపోయేవారిలో 40 ఏళ్లలోపు వారు కూడా ఎక్కువ మందే ఉంటున్నారు. దేశంలో 55 ఏళ్లలోపు వారిలో 50 శాతం మందికి గుండె పోటు వస్తోందని వైద్యులు చెబుతున్నారు. హృద్రోగుల్లో 25 శాతం మంది 40 ఏళ్లలోపువారు కూడా ఉంటున్నారని వెల్లడించారు. అందువల్ల యువతా.. పెద్దలు.. తేడా లేకుండా అందరూ జీవన శైలిని మార్చుకోవాలని ఎయిమ్స్‌లో హృద్రోగ నిపుణులు డాక్టర్‌ సందీప్‌ మిశ్రా సూచించారు. పాశ్చాత్య దేశాల వారితో పోల్చితే మనవారు 10 ఏళ్ల ముందే గుండెపోటుకు గురవుతున్నారని గంగారామ్‌ ఆస్పత్రి కార్డియాలజీ విభాగ అధిపతి జేపీఎస్‌ సాహ్నే వెల్లడించారు. ఎక్కువ మందికి గుండెపోటు రావడానికి కారణం.. జన్యుపరమైన.. కొలెస్ర్టాల్‌ను పెంచే హైపర్‌కొలెసో్ట్రలీమియా అని తెలిపారు.

* హృద్రోగాలు/స్ర్టోక్‌
-మూడో వంతు మరణాలకు ఇవే కారణం
-అన్ని దేశాలపైనా వీటి ప్రభావం ఉంది
-2015లో 2 కోట్ల మంది హృద్రోగాలతో చనిపోయారు
-అప్పుడు 73 లక్షల మందికి గుండెపోటు వచ్చింది
-90 లక్షల మందికి స్ర్టోక్‌ వచ్చింది
-40 కోట్ల మందికి ఈ సమస్యలు వచ్చాయి

* హృద్రోగాలు తగ్గాయి కానీ!
-1990లో లక్షకు 393 మంది హృద్రోగాలతో మృతి చెందారు.
-2010లో 307కి తగ్గారు.
-కానీ 2020కి ఇది కేవలం 286కే పరిమితం కానుంది.
-అంతకు ముందు దశాబ్దం ప్రకారమైతే.. 221కి తగ్గాలి.

To Top

Send this to a friend