చంద్రబాబును కాపాడాడు..

ఏపీ సీఎం చంద్రబాబు అమెరికా నుంచి ఢిల్లీ చేరాక విజయవాడ రాకుండా ఓ ఆరుగంటల పాటు మిస్సింగ్ కావడానికి కారణమేంటనే ప్రశ్న ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. దీనిపై అటు చంద్రబాబు కానీ, టీడీపీ సీనియర్ నేతలు కానీ ఏ ఒక్కరు సమాధానం ఇవ్వడం లేదు. దీంతో ఈ వార్త దావానంలా వ్యాపిస్తోంది. ఒక్కొక్కరు ఒక్కో సమాధానాన్ని వెతుకుతున్నారు. చంద్రబాబు లోపాయికారి ఒప్పందాల కోసం ఢిల్లీ పెద్దలను శరణు వేడారని కొందరు.. ఓటుకు నోటు కేసుపై.. జగన్ ను బీజేపీ పెద్దలకు దూరం చేయాలని చంద్రబాబు లాబీయింగ్ చేశాడని మరికొందరు ఆరోపిస్తున్నారు. ఇలా ఎవరికి వాళ్లు విమర్శలు చేస్తున్నా ఎవ్వరూ స్పందించలేదు. కానీ చంద్రబాబు అనుంగ సన్నిహితుడు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ దీనిపై అద్భుత కథనాన్ని జోడించి చంద్రబాబును సేవ్ చేసే పనిని నెత్తిన పెట్టుకున్నాడు.

చంద్రబాబు  2.30 కి అమెరికా నుంచి ఢిల్లీ చేరాడట.. అనంతరం ఎయిర్ బస్, కువైట్ కు చెందిన ఆయిల్ కంపెనీలతో చంద్రబాబు సమావేశమయ్యారట.. అయితే పెట్టుబడులపై ఒక అవగాహనకు రాకుండా బయటకు వెల్లడించొద్దని సీఎం చంద్రబాబుకు ఆ కంపెనీ ప్రతినిధులు షరతు విధించారు. బయటకు చెబితే తమ కంపెనీల షేర్ విలువలు, ఇతర అంశాలపై ప్రభావం ఉంటుందని సమావేశం వివరాలు చెప్పొద్దని స్పష్టం చేశారట.. అందుకే చంద్రబాబు ఆ ఆరు గంటల మీటింగ్ ను రహస్యంగా ఉంచాడట..

ఈ అద్భుత కవరింగ్ ఐడియా ను అంతే అద్భుతంగా పాఠకులకు అందించి ఆంధ్రజ్యోతి వైసీపీ నేతలకు సవాల్ విసిరింది. చంద్రబాబును ఈ గండం నుంచి భలేగా కాపాడింది. అయినా ఇంత పెద్ద వివాదాన్ని వాడుకోవడానికి వైసీపీ అధినేత జగన్ కు, వైసీపీ అభిమానులకు టైం లేకుండా పోయింది. ఎంతో పెద్ద వివాదం చేయాల్సిన విషయాన్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అటు చంద్రబాబు, ఇటు టీడీపీ నేతలు సీఎం ఆరు గంటల మిస్సింగ్ పై ఏం చెప్పాలో తెలియక తలపట్టుకుంటున్న వేళ.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ ఓ మాంచి పకడ్బందీ కథనంలో చంద్రబాబును రక్షించాడు..

To Top

Send this to a friend