హరీష్‌ శంకర్‌ మెగా ప్లాన్‌ అదిరింది!


‘మిరపకాయ్‌’, ‘గబ్బర్‌సింగ్‌’ చిత్రాలతో టాలీవుడ్‌ స్టార్‌ దర్శకుల జాబితాలో హరీష్‌ శంకర్‌ చేరిపోయాడు. ఆ తర్వాత ఫ్లాప్స్‌ వచ్చినా కూడా ఆయన స్థాయి మాత్రం తగ్గడం లేదు. సాయి ధరమ్‌ తేజ్‌ ‘సుబ్రమణ్యం ఫర్‌సేల్‌’ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకుని, కాస్త గ్యాప్‌ తీసుకుని మళ్లీ మెగా హీరో అల్లు అర్జున్‌తో ‘డీజే’ చిత్రాన్ని చేయడం జరిగింది. డీజే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన హరీష్‌ శంకర్‌ సక్సెస్‌ను దక్కించుకున్నాడు. ప్రస్తుతం ‘డీజే’ ప్రమోషన్‌ విషయాన్ని చూసుకుంటున్న హరీష్‌ శంకర్‌ తర్వాత సినిమా గురించి అప్పుడే చర్చ మొదలైంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం హరీష్‌ శంకర్‌ తర్వాత చిత్రం మెగా హీరోతోనే ఉండే అవకాశం ఉందని తొస్తోంది. ఇటీవల ఈయన మీడియాతో మాట్లాడుతూ పవన్‌ కళ్యాణ్‌తో తాను సినిమా చేసే ఆలోచన చేయడం లేదని, అయితే చిరంజీవికి తగ్గ ఒక కథను సిద్దం చేసుకుని ఎదురు చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. చిరంజీవితో సినిమా ఛాన్స్‌ కోసం కాస్త ఎక్కువ సమయం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది.

చిరంజీవి 151 మరియు 152 చిత్రాల దర్శకులు కమిట్‌ అయ్యారు. దాంతో 153 సినిమాకు ఏమైనా ఛాన్స్‌ దక్కేనో చూడాలి. చిరు 153 సినిమాకు ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఆలోపు చిరంజీవితో సన్నిహితంగా ఉండేందుకు యువ మెగా హీరోతో సినిమాను దర్శకుడు హరీష్‌ శంకర్‌ ప్లాన్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మెగా హీరోతో సినిమా చేసి, చిరంజీవి దృష్టిని ఆకర్షించి, చిరంజీవితో సినిమా చేయాలనేది హరీష్‌ మెగా ప్లాన్‌గా సినీ వర్గాల వారు చెబుతున్నారు.

To Top

Send this to a friend