దమ్ముంటే నిరూపించండి..


సోషల్‌ మీడియాలో ఇటీవల ‘డీజే’ గురించి తీవ్ర స్థాయిలో వ్యతిరేక కథనాలు వస్తున్నాయి. వ్యతిరేక ప్రచారం జరుగుతుంది. సినిమా ప్రారంభం నుండి కూడా ‘డీజే’పై సోషల్‌ మీడియాలో ఒక వర్గం వారు విమర్శలు చేస్తూనే ఉన్నారు. విడుదలకు ముందు బ్రహ్మణ సంఘాల వారితో ఇబ్బంది పడ్డ డీజే టీం విడుదలైన తర్వాత వెబ్‌ సైట్లలో నెగటివ్‌ రివ్యూలు రావడంతో ఇబ్బంది పడ్డారు.

ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఆ వర్గం వారు ‘డీజే’ కలెక్షన్స్‌ మొత్తం ఫేక్‌ అంటూ ప్రచారం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ‘డీజే’ కలెక్షన్స్‌ గురించి వ్యతిరేక ప్రచారం చేస్తున్న వారికి దర్శకుడు హరీష్‌ శంకర్‌ ఛాలెంజ్‌ విసిరాడు. మొదటి వారంలోనే 100 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్‌ చేసిన ‘డీజే’ చిత్రం కలెక్షన్స్‌ తప్పు అని నిరూపిస్తే తాను సినిమాల నుండి తప్పుకుంటాను అని, మళ్లీ సినిమాల మొహం చూడను అంటూ చెప్పుకొచ్చాడు.

మీడియా నుండి కాని, ఇండస్ట్రీ నుండి కాని మరెవ్వరైనా కూడా ‘డీజే’ కలెక్షన్స్‌ తప్పు అని నిరూపిస్తే వారు ఏం చెప్పినా చేసేందుకు సిద్దంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఇలాంటి చెత్త విమర్శలు పట్టించుకోను నేను, కాని తప్పడం లేదు అంటూ హరీష్‌ శంకర్‌ ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం తాను సినిమా సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాను అని తర్వాత సినిమా గురించి ఇంకా ఆలోచించలేదు అని చెప్పుకొచ్చాడు.

To Top

Send this to a friend