బిగ్ బాస్ లో నవరస కళాపిపాసి

ఆమె మాట మధురం.. ఆమె పాఠం అమోఘం.. ఆమె నృత్యం.. నమెలి పించం.. ఇలా నవరస కళాపిపాసిగా హరితేజ బిగ్ బాస్ లో మారిపోతున్నారు. అటు పాటలు, ఇటు డ్యాన్సులు చేస్తూ బిగ్ బాస్ లో తనకు తానే పోటీ.. తనకు రారు ఎవరు సాటి అంటూ నిరూపించుకుంటున్నారు. నిన్న బిగ్ బాస్ షోలో ఓ రిక్షా టాస్క్ తో పాటు గిరిజన యువతి పాత్రలో హరితేజ పాడిన పాటలు, చేసిన డ్యాన్సులు ఆకట్టుకున్నాయి.

ఇక ఈరోజు కాకతీయ రాజుల చరిత్రను చెప్పే టాస్క్ లో రుద్రమదేవీగా హరితేజ జీవించి శభాష్ అనిపించుకుంది. ఇలా అందరూ ఇంటిబెంగతో కుదలేవుతుంటే హరితేజ మాత్రం మరింత రెట్టించిన ఉత్సాహంతో హౌస్ లో సందడి చేస్తుండడం విశేషం.అందరు సెలబ్రెటీల్లో ఒక్కరు మాత్రం ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ.. పాటలు పాడుతూ, డ్యాన్సులు చేస్తూ వివిధ వేషధారణలతో బిగ్ బాస్ ప్రేక్షకులకు కనువిందు చేస్తున్నారు. ఆమె హరితేజ.

హరితేజ ఉత్సాహానికి ప్రేక్షకులందరూ ఫిదా అవుతున్నారంటే అతిశయోక్తి కాదు.. బిగ్ బాస్ షో మొదలుపెట్టి దాదాపు 45 రోజులు దగ్గరకు వస్తోంది. మొదట 14మంది ఉన్న సెలబ్రెటీల సంఖ్య ఇప్పుడు 9కి పడిపోయింది. వారం వారం ఒక్కరొక్కరు బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోతుంటే మిగతా సెలబ్రెటీల్లో ఆనందం ఆవిరైపోతోంది. ఆదర్ష్ లాంటి వారికి ఇంటిబెంగ పట్టుకొని వ్యాయామాలు చేసుకుంటూ ఆ బెంగను తగ్గించుకుంటున్నారు. ఇలా ఇన్ని రోజులు గడవడంతో బిగ్ బాస్ లోని ఇంటిసభ్యుల ముఖాల్లో ఉత్సాహం, ఉత్తేజం లేకుండా నిస్తేజంగా రోజులు గడిపేస్తున్నారు. కానీ హరితేజలో ఎక్కడ లేని విశ్వాసం, ఉత్సాహం బిగ్ బాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

To Top

Send this to a friend