బిగ్ బాస్ లోకి మరో ఇద్దరు సెలబ్రెటీలు..

గడిచిన వారం ఇద్దరిని ఎలిమినేట్ చేయడంతో షాక్ అయిన ప్రేక్షకులకు నవదీప్ ను బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు బిగ్ బాస్. నిన్నటి ఎపిసోడ్లో నవదీప్, దీక్షలను అతిథులుగా, మిగతావారిని సేవకులుగా మార్చి వారితో ఓ ఆట ఆడిస్తున్నారు. అర్చననే వీక్ క్యాండేట్ అని ఆమెనే నవదీప్ నామినేట్ చేయడం సంచలనమైంది. వచ్చీ రావడంతో అందరికీ నవదీప్ ర్యాంకింగ్స్ ఇవ్వడం ఉత్కంఠ రేపింది.

నవదీప్ చేస్తున్న ఈ దూకుడుకు టీవీ రేటింగ్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయట.. నవదీప్ ఎంట్రీ హిట్ కావడంతో వచ్చేవారం కూడా మరో ఇద్దరిని హౌస్ నుంచి ఎలిమినేట్ చేసి మరో ఇద్దరిని హౌస్ లోకి పంపేందుకు బిగ్ బాస్ టీం రెడీ అయ్యింది. బిగ్ బాస్ లోకి నవదీప్ ఎంట్రీ హిట్ కావడంతో ఇక మరో ఇద్దరు సెలబ్రెటీలను బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.

అర్చనతోపాటు మరొకరిని ఎలిమినేట్ చేసి ఆ ఇద్దరి ప్లేసులో నటి మంచు లక్ష్మీని, బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలను బిగ్ బాస్ లోకి పంపేందుకు డిసైడ్ అయినట్టు సమాచారం. వీరిద్దరి ఎంట్రీ జరిగితే బిగ్ బాస్ షో ఎక్కడికో వెళ్లిపోతుందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే షోలో తెలుగు మాట్లాడక అందరూ పరేషన్ అవుతుంటే మంచు లక్ష్మీ వచ్చీరాని తెలుగు, గుత్త జ్వాల అందాలు బిగ్ బాస్ షోను మరింత రక్తి కట్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

To Top

Send this to a friend