గుండెనొప్పికి ముందు భుజం నొప్పి..


తరచూ భుజంనొప్పితో బాధపడుతున్నారా? అయితే అది కేవలం శ్రమ వల్లే అనుకుని అలాగే వదిలేయకండి. అది పొంచి ఉన్న హృద్రోగానికీ సంకేతమే అని హెచ్చరిస్తున్నారు ఉటాహ్‌ విశ్వవిద్యాలయ నిపుణులు. సాధారణంగా పని ఎక్కువగా ఉన్నప్పుడు భుజాల దగ్గర ఉన్న కీళ్లూ, కండరాలూ, నరాలూ అన్నీ నొప్పికి కారణమవుతాయి. దాంతో అదేదో శారీరక శ్రమ ఎక్కువ కావడం వల్లే ఆ నొప్పులన్నీ అని వాటిని వదిలేస్తాం. లేదా పని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తాం.

కానీ ఇటీవల భుజం దగ్గర ఉన్న కీళ్లలో నొప్పి ఎక్కువగా ఉన్నవాళ్లను పరిశీలించినప్పుడు వాళ్లలో బీపీ, కొలెస్ట్రాల్‌, మధుమేహం వంటి వ్యాధులూ బయటపడ్డాయట. అవన్నీ కూడా హృద్రోగానికి దారితీసేవే. అంతేకాదు, భుజాలనొప్పి లేనివాళ్లలో ఈ రకమైన సమస్యలు కూడా తక్కువగా ఉన్నట్లు తేలిందట. ముఖ్యంగా భుజంనొప్పి ఎక్కువగా ఉన్నవాళ్లలో చాలామంది మధ్య వయసులోనే హృద్రోగసమస్యల్నీ ఎదుర్కొంటున్నారట. కాబట్టి తస్మాత్‌ జాగ్రత్త అంటున్నారు.

To Top

Send this to a friend