గడ్డం పెంచుకుంటే మంచిదా.. తీసేస్తేనా.?

విరాట్ కోహ్లీ నుంచి మొదలెడితే హీరో ప్రభాస్ వరకు అందరూ గడ్డం రాయుళ్లే.. గడ్డమే మా అందం అంటూ దేశంలోని చాలా మంది యువత, సెలబ్రెటీలు గడ్డాలు తెగ పెంచేస్తున్నారు. దేశంలో ఇప్పుడు గడ్డం పెంచుకోవడం ఒక ఫ్యాషన్ గా మారింది. భారత కెప్టెన్ విరాట్ సహా క్రికెటర్లందరూ గడ్డం పెంచేస్తున్నారు. ఇక బాహుబలి సినిమాలోని హీరో ప్రభాస్ , విలన్ రానా సహా అందరూ గడ్డాలు పెంచేసి కనిపించి సందడి చేశారు. యూత్, కాలేజీ విద్యార్థులందరూ ఇప్పుడు గడ్డం పెంచుకోవడాన్ని ఫ్యాషన్ గా భావిస్తున్నారు. ఇటీవల చేసిన ఓ లండన్ లోని ఓ యూనివర్సిటీ పరిశోధకుల బృందం చేసిన సర్వే గడ్డం ప్రాముఖ్యతను వివరించింది..

గడ్డం అనేది కఠిన , ధృఢ మనస్తత్వానికి చిహ్నమని అందుకే గడ్డం పెంచుకున్న వాళ్లనే మహిళలు ఇష్టపడుతున్నట్టు తేలిందట.. అంతేకాదు.. గడ్డం ఫుల్ గా ఉంటే నోటి ద్వారా బ్యాక్టీరియా, దుమ్ము ప్రవేశించదు.. గొంతునొప్పి, గొంతులో ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు రావట.. అస్తమ సమస్య దరిచేరదట.. ముక్కు రంధ్రాల్లో దుమ్ము వెళ్లకుండా మీసాలు, గడ్డం అడ్డుకుంటుందట.. కాబట్టి టాక్సిన్ లోపలికి వెళ్లకుండా గడ్డమే కాపడుతోందట. ఇలా గడ్డం వల్ల ఎన్నో ఉపయోగాలతో పాటు అమ్మాయిల మనసు దోచుకునే అవకాశం ఉండడంతో విపరీతంగా గడ్డం పెంచేస్తున్నారు అబ్బాయిలు..

లండన్ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన సర్వేలో క్లీన్ షేవ్ చేసుకున్న వారి కంటే గడ్డంతో ఉన్నవారు కాన్ఫిడెంట్ గా ఉంటారని.. మరింత ఎట్రాక్టివ్ గా కనిపిస్తారని మహిళలు భావిస్తారట.. గడ్డం ఉన్న అబ్బాయిల చుట్టే అమ్మాయిలు పడుతున్నట్టు సర్వేలో తేలింది.. సో యూత్.. ఇక గడ్డాలు పెంచేయండి. అమ్మాయిలను బుట్టలో పడేయండి..

To Top

Send this to a friend