మోడీకి ఘోర అవమానం..


మోడీకి ఇది ఘోర అవమానం.. పాకిస్తాన్ చేతిలో భారత్ కు ఎదురవుతున్న అవమానాలకు ఓపిక నశించిన ఓ మాజీ సైనికుడి భార్య ఏకంగా ప్రధాని మోడీకి 56 అంగుళాల జాకెట్ పంపడం కలకలం రేపింది.. మోడీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పాకిస్తాన్ ను ఎందుకు కట్టడి చేయడం లేదని.. వారు భారత సైనికుల తలలు నరుకుతున్నా ఎందుకు మిన్నకుంటున్నారని సదురు మహిళ లేఖలో ప్రశ్నించడం ఇప్పుడు జాతీయ స్థాయిలో దుమారం రేపుతోంది.

గత ఎన్నికల ప్రచారం లో ప్రధాని మోడీ దేశ ప్రజలకు హామీ ఇచ్చారు. అధికారంలోకి వస్తే పాక్… భారత్ పైకి కన్నెత్తి చూడకుండా చేస్తానని.. తన 56 అంగుళాల చాతిని ఎదురు నిలుపుతానని ప్రతిన బూనారు. ఆ ప్రతిన ఇప్పుడు ఏమైందని.. భారత సైనికులను పాక్ దళాలు ముక్కలుగా కోస్తున్నా ఎందుకు స్పందించడం లేదని సదురు మహిళ ప్రశ్నించింది. పాక్ సైన్యం దాడులను నివారించలేకపోతున్నారని నిరసిస్తూ లేఖతో పాటు 56 అంగుళాల జాకెట్ (బ్లౌజ్)ను హర్యాణా రాష్ట్రంలోని ఫతేహాబాద్ జిల్లాకు చెందిన మాజీ సైనికుడు ధరమ్ వీర్ భార్య సుమన్ సింగ్ మోడీకి పంపారు. దాంతోపాటు మోడీని ప్రశ్నిస్తూ లేఖ కూడా పంపారు.

ఈ లేఖ జాతీయ స్థాయిలో దుమారం రేపుతోంది. ప్రధాని నరేంద్రమోడీ కి ఇంతకంటే ఘోర అవమానం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. భారత సైనికుల తలలు నరుకుతున్నా భీష్ముడిలా చూస్తూ ఉరుకుంటున్న మోడీకి ఓ సైనికుడి భార్య కరెక్ట్ సమాధానం ఇచ్చిందని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. అయితే మోడీకి జాకెట్ పంపిన సదురు మహిళా , ఆమె భర్త ఇటీవలే ఆప్ పార్టీలో చేరారని.. కావాలనే మోడీని ఇరుకున పెట్టేందుకు జాకెట్ పంపించిందని బీజేపీ వర్గాలు ఆరాతీశాయి.

To Top

Send this to a friend