భళా మోడీ.. బీహార్ ను బీజేపీ వశం చేశాడు..

అధికారం మన చుట్టమైతే.. ఏ రాష్ట్రాన్ని అయినా కదిలించవచ్చని నిరూపించారు మోడీ. అమ్మ జయలలిత మరణం తర్వాత తమిళనాడును ఎలాగైతే చేజిక్కించుకున్నాడో అచ్చం అలాగే సీబీఐ భూతాన్ని ప్రయోగించి బీహార్ నేత లాలూపై కేసులు పెట్టించి ఇరికించి ప్రాణ స్నేహితులైన లాలూ-నితీష్ లను విడగొట్టాడు. వెరసి మోడీ తన స్నేహం హస్తాన్ని నితీష్ కు అందించి బీహార్ లో ఎన్టీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. అద్గదీ మోడీ అంటే అని నిరూపించాడు.

బీజేపీని గత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ లు కూటమిగా ఏర్పడి మట్టికరిపించాయి. లాలూ ప్రసాద్ పార్టీకి అత్యధిక సీట్లు వచ్చాయి. జేడీయూ నేత నితీష్ ను సీఎం చేసి బీహార్ లో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. బీహార్ లో ఓటమిపై ఎప్పటి నుంచో రగిలిపోతున్న మోడీ అదునుచూసి లాలూ ప్రసాద్ పాత కేసులు తవ్వాడు. సీబీఐని ప్రయోగించి లాలూ, అతడి కుమారుడిపై కేసులు పెట్టారు. కేసులు ఉన్న వారు ప్రభుత్వంలో ఉండడానికి వీల్లేదని సీఎం నితీష్ కోరడం దానికి లాలూ, లాలూ కుమారుడు ససేమిరా అనడంతో ఇక చేసేందేం లేక సీఎం నితీష్ రాజనీమా చేసి బీహార్ ప్రభుత్వాన్ని రద్దు చేశారు..

సీఎంగా నితీష్ రాజీనామా చేయగానే నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీహార్ లో కొన్ని సీట్లు గెలిచిన బీజేపీ నితీష్ కు మద్దతిచ్చింది. ఎన్టీఏ తరఫున నితీష్ ను సీఎంగా ప్రకటించింది. దీంతో మహాకూటమి నుంచి వైదొలిగి బీజేపీ అండతో ఈరోజు నితీష్ కుమార్ మళ్లీ సీఎంగా ప్రమాణం చేయబోతున్నాడు.

ఇలా మోడీ ప్రాణ స్నేహితులను పాత కేసులతో విడగొట్టి శత్రువు నితీష్ ను మిత్రువుగా చేసుకొని బీహార్ లో అధికారాన్ని కొల్లగొట్టాడు. ఇలా తమిళనాడును కబళించిన మోడీ.. బీహార్ ను కబళించి తన హస్తగతం చేసుకున్నారు.

To Top

Send this to a friend