జీపీఎస్ బంద్.. నావిక్ సిద్ధం..

కార్గిల్ యుద్ధ సమయం.. ఉగ్రవాదులను ఏరివేసేందుకు వారు ఎక్కడెక్కడున్నారో సమాచారం ఇవ్వాలని భారత్… అమెరికాను కోరింది. ఎందుకంటే అమెరికా వద్ద అత్యాధునికి గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ (జీపీఎస్) వ్యవస్థ ఉంది. ఇప్పుడది మనం ఫోన్లలో కూడా వాడుతున్నాం. దీని వల్ల ఉపగ్రహాల ద్వారా మనం ఎక్కడున్నది.. ఎక్కడికైనా వెళ్లాలన్నా తెలుస్తుంది. జీపీఎస్ దారి చూపుతుంది. కానీ కార్గిల్ యుద్ధ సమయంలో అమెరికా మనకు జీపీఎస్ ఇవ్వడానికి నిరాకరించింది.. దీంతో మేలుకున్న భారత్ అప్పుడే అత్యాధునిక స్వదేశీ నావిగేషన్ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. అప్పటినుంచి మొదలుపెడితే ఇప్పుటికి మనం పూర్తి స్థాయిలో స్వదేశీ నావిగేషన్ వ్యవస్థను రూపొందించుకున్నాం..

 

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సహకారంతో భారత్ అంతరిక్షంలో 7 ఉపగ్రహాలను ప్రయోగించింది. మన జీపీఎస్ వ్యవస్థకు భారత్ శాస్త్రవేత్తలు నావిక్ అని పేరు పెట్టారు. ఈ ఏడు భారత్ కు 36వేల కి.మీ ఎత్తులో భారత్ చుట్టు పక్కల 1500 కి.మీ ల వరకూ సమాచారాన్ని సేకరిస్తాయి. అమెరికా జీపీఎస్ ఆకాశం నుంచి 20-30 మీటర్ల వరకు ఖచ్చితత్వంగా చిత్రాలు తీస్తే.. భారత్ సమాచార వ్యవస్థ నావిక్ 5 మీటర్ల వరకు ఖచ్చితత్వంగా చిత్రాలు, సమాచారాన్ని సేకరిస్తుంది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరూ అమెరికా జీపీఎస్ నే సమాచార సేకరణకు వాడుతున్నారు. కానీ కొన్ని దేశాలు మాత్రం సొంత నావిగేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి. రష్యా గ్లాస్ నాస్, యూరప్ గెలిలీయో, జపాన్ క్విస్ అనే వ్యవస్థలను రూపొందించుకొని వాటి దేశాల్లో ఉపయోగిస్తున్నాయి. ఇప్పుడు భారత్ కూడా సొంతంగా నావిక్ అనే సమాచార వ్యవస్థను రూపొందించుకొని సత్తా చాటింది.. సముద్రంపై, భూభాగంపై, ఇప్పుడు ఏ సమాచారం కావాలన్నా నావిక్ ద్వారా తెలుసుకోవచ్చు..

To Top

Send this to a friend