ఆధార్‌ లింక్‌ చేయకపోతే ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేయనట్లే

ఐటి రిటర్న్స్‌ దాఖలు చేసి ఆధార్‌కార్డ్‌ అనుసంధానం చేయలేదా.. అయితే మీరు దాఖలు చేయనట్లే లెక్కని కేంద్ర తేల్చిచెప్పింది. దాంతో ఐటీఆర్‌ దాఖలు చేయడంతోపాటు ఆధార్‌ కూడా కీలకంగా మారింది. ఈ ప్రక్రియకు ఆగస్టు 31 వరకు అవకాశముంది. ఎక్కువ మందిలో ఆధార్‌ లింక్‌ చేయకపోతే ఏమవుతుంది..?

ఐటీఆర్‌ దాఖలుచేసి ఆధార్‌ అనుసంధానం చేయకపోతే దాన్ని ఐటీ శాఖ పరిగణనలోకి తీసుకోదు. పైగా ఐటీఆర్‌ దాఖలు చేయని వారి జాబితాలో వీరిని చేర్చుతారు. అలాంటి వారికి ఐటీఆర్‌ సెక్షన్‌ 142(1) ప్రకారం నోటీసులు జారీ చేస్తారు. దానికి రూ.5వేలు ఫెనాల్టీ వేస్తారు. ఆదాయపన్నుతో చేసుకునే క్లైములను చేసుకోలేరు. నష్టాలు, పెట్టుబడి, బిజినెస్‌ నష్టాలను క్యారీ ఫార్వడ్‌ చేసుకోలేరు.ఎవైనా రింఫండ్స్‌ వచ్చేవి ఉంటే వాటిని మంజూరు చేయరు
కొన్ని క్యాటగిరీ వారికి వెసుబాటు ఉంటుంది
ఎన్నారైలు, 80 ఏళ్లకు పైబడిన వారు, అస్సాం, మేఘాలయ, జమ్ము కశ్మీర్‌ ప్రజలకు కొంత వెసులు బాటు ఉంటుంది.

To Top

Send this to a friend