స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ ఇచ్చిన విందుకు ఇద్దరు సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ తో పాటు మరో ముఖ్య అతిథి వేడుకకు హాజరయ్యారు. ఆ వేడుకలో పవన్ కళ్యాన్ తొలిసారి పాల్గొని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. పవన్ వస్తారని ఎవ్వరూ ఊహించలేదట.. గవర్నర్ చొరవతోనే పవన్ వచ్చాడని తెలిసింది. ఇదే విషయాన్ని ‘చూశారా.. పవన్ ను కూడా పార్టీకి రప్పించా’ అని గవర్నర్ ఏపీ మంత్రులకు ఆనందంగా చెప్పాడట..
సాధారణంగా జనసేన అధినేత పవన్ కళ్యాన్ ఇలాంటి పార్టీలకు దూరంగా ఉంటారు. ప్రజాయోపగ పనులతో పాటు వివిధ పేదలకు అవసరార్థం రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తుంటాడు. అయితే గవర్నర్ నిర్వహించిన ఎట్ హోంకు పవన్ హాజరవుతాడని ఎవ్వరూ ఊహించలేదు.
ఈ కార్యక్రమంలో చంద్రబాబు, కేసీఆర్ లతో పవన్ పిచ్చాపాటిగా మాట్లాడరట.. ఇందులో కేసీఆర్ వేసిన జోకులకు తెగ నవ్వేశాడట పవన్. బయట వీరావేశంతో ప్రసంగాలు ఇచ్చే నేతలంతా ఇలా ఎట్ హోంలో కలిసిపోయి సరదాగా జోకులు వేసుకోవడం అందరినీ ఆకర్షించింది. ఇక ఇదే కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ కు, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ మధ్య నేరెళ్ల విషయంలో చిన్నపాటి సంవాదం జరిగినట్టు తెలిసింది. ఇలా సరద సరదాగా ఎట్ హోం సాగిపోయింది. చంద్రబాబు, కేసీఆర్, పవన్ సహా ముఖ్యులు మంత్రులు సందడిచేశారు.
