ఉన్నోడికి పంచేయ్.. దేశం దాటేయ్..

బ్యాంకులు అదే పనిచేస్తాయి.. ఒక పేదవాడు లోన్ కోసం వెళితే ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాయి. అదే ఓ బడా పారిశ్రామికవేత్తకు రెడ్ కార్పేట్ వేసి వేల కోట్ల అప్పులిచ్చి వారి సేవలో తరిస్తాయి.. ఇలా బడాబాబులకు వేల కోట్లు ఇస్తే వారేమో అప్పులపాలై దేశం విడిచి పోయి విదేశాల్లో దర్జాగా విలాస జీవితం గడుపుతున్నారు.

మన వ్యవస్థలు, మన చట్టాలు బడా బాబులకు చుట్టాలు అని మరోసారి నిరూపితమైంది.. ఇండియన్ బ్యాంకుల వద్ద దాదాపు రూ.9వేల కోట్లకు పైగా రుణాలు తీసుకొని ఎగొట్టాడు కింగ్ ఫిషర్ అధినేత, భారత మోస్ట్ వాంటెడ్ విజయ్ మాల్యా.. అనంతరం అప్పులు తీర్చే మార్గం లేక ఇంగ్లండ్ దేశం చెక్కేసి అక్కడ విలాస జీవితం గడుపుతున్నాడు. అతడిని పట్టుకునేందుకు భారత ప్రభుత్వం రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది. బ్రిటన్ కు విన్నవించింది. అయినా కూడా ఇండియాకు ఈ మాల్యాను రప్పించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైంది.

ఇంగ్లండ్ లో దొంగచాటుగా ఆశ్రయం పొందుతున్న మాల్యా తన సరదాలు తీర్చుకోవడంలో మాత్రం ఎక్కడ వెనకడుగు వేయడం లేదు. ఆదివారం ఇంగ్లండ్ లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో భారత్- పాకిస్తాన్ మ్యాచ్ కు వచ్చి విజయ్ మాల్యా దర్జాగా మ్యాచ్ వీక్షించాడు. అంతేకాదు.. ఇంగ్లండ్ కు వచ్చిన భారత మాజీ క్రికెటర్లతో ముచ్చటించాడు. ఇండియన్ గవర్నర్ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసిన నిందితుడుతో ఇలా భారత మాజీ క్రికెటర్లు అంటకాగడం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. విజయ్ మాల్యతో క్రికెటర్ సునీల్ గవాస్కర్ సన్నిహితంగా ఉన్న ఫొటోపై నెటిజన్లు మండిపడుతున్నారు. పారిపోయిన దొంగతో క్రికెటర్ల సాన్నిహిత్యంపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

To Top

Send this to a friend