అర్ధరాత్రిపై స్కూటర్‌పై గవర్నర్‌ ఎందుకు వెళ్లారంటే..

పూర్వ కాలంలో తమ రాజ్యంలో ప్రజలు ఎలా ఉంటున్నారు, వారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని తెలుసుకునేందుకు రాజులు మారువేషాల్లో వెళ్లి రాజ్యాలను పరిశీలించేవాళ్లని కథల్లో వింటూనే ఉన్నాం. అచ్చం అలాగే ఓ గవర్నరు కూడా తానెవరనేది తెలియకుండా బయటకు వెళ్లారు.

అర్ధరాత్రి వేళ పుదుచ్చేరిలో మహిళ భద్రత ఎలా ఉందో తెలుసుకునేందుకు సాక్షాత్తూ గవర్నరు ఓ అజ్ఞాత వ్యక్తి మాదిరిగా వెళ్లి పరిశీలించారు. ద్విచక్రవాహనంపై వెళ్లి ప్రధాన రహదారుల్లో మహిళకు భద్రత ఎలా ఉందనేది పర్యవేక్షించారు. ఆమె మరెవరో కాదు.. పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నరు కిరణ్‌బేడి.

ఎవరూ ఆమెను గుర్తు పట్టకుండా ఉండేందుకు ముఖానికి చున్నీ కప్పుకున్నారు.ఎటువంటి భద్రత లేకుండా అర్ధరాత్రి వేళ ఆమె ఎంతో ధైర్యంగా ద్విచక్రవాహనంపై పర్యటించారు. దీని గురించి ఆమె స్వయంగా ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. ‘పుదుచ్చేరిలో రాత్రివేళ బయట ఉండటం సురక్షితమే. కానీ భద్రతను మరింత మెరుగుపరుస్తాం’.ప్రజలు తమకు ఏదైనా అవసరమైతే పీసీఆర్‌, 100కు ఫోన్‌ చేసి సహాయం తీసుకోవాల్సింది ఆమె కోరారు.

To Top

Send this to a friend