గూగుల్ సరికొత్త సార్ట్ ఫోన్ సాఫ్ట్ వేర్ ‘ఓరియో’..

సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తన సరికొత్త మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ను అమెరికాలో గ్రాండ్ గా లాంచ్ చేసింది. ‘ఆండ్రాయిడ్ 8.0 ఓరియో అనే పేరున కొత్త వెర్షన్ కు నామకరణం చేసి విడుదల చేశారు. ఈ కొత్త ఆండ్రాయిడ్ వెర్షన్ లో ఎన్నో సరికొత్త ఫీచర్లను పొందుపరిచింది గూగుల్.. పిక్చర్ ఇన్ పిక్చర్, ఆటోఫిల్, ఇంప్రూవ్డ్ నోటిఫికేషన్స్, వంటి ఫీచర్లు హైలెట్ గా చెప్పుకోవచ్చు. తన కొత్త సాఫ్ట్ వేర్లకు మార్కెట్లోని ఫేమస్ చాక్లెట్ ఫ్లేవర్ల పేర్లు పెట్టే గూగుల్ ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని పాటించింది. ఆండ్రాయిడ్ గతంలో విడుదల చేసిన 1.5 కప్ కేక్, ఆండ్రాయిడ్ కిట్ కాట్, లాలీపాప్, నౌగట్ లు కూడా చాక్లెట్ ఫ్లేవర్లే..

కొత్తగా విడుదల చేసిన ఆండ్రాయిడ్ 8.0 ఓరియో వెర్షన్ కు అప్ డేట్ గా ఒక కొత్త పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్ తో పాటుగా ఆపరేటింగ్ సిస్టంకు కొత్త నోటిఫికేషన్ డాట్స్ తో పాటు బ్లూటూత్ ఆడియో ప్లే బ్యాక్ ను ఇంప్రూవ్డ్ క్వాలిటీతో అందించనుంది. ఎన్నో ఆధునాతన ఫీచర్లు, టూల్స్ ఉన్నాయి. కొత్త ఎమోజీలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఒకేసారి రెండు యాప్స్ ను ఉపయోగించే విధంగా ఈ ఓఎస్ ను అభివృద్ధి చేశారు.

ఈ కొత్త ఓఎస్ లో ప్రతిసారి పాస్ వర్డ్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు.. భవిష్యత్ లో కావాలనుకున్నప్పుడు వివిధ యాప్స్ లోనూ, వెబ్ సైట్లలోనూ ఆ సమాచారాన్ని ఉపయోగించుకోవచ్చు. గత వెర్షన్ నౌగౌట్ కంటే ఓరియో ఓఎస్ రెండు రెట్ల వేగంతో పనిచేస్తుంది. అంతేకాదు ఉపయోగించని యాప్ లను అదుపులో ఉంచుతుంది. తద్వారా చార్జింగ్ సేవ్ అవడంతో పాటు బ్యాటరీ లైఫ్ మెరుగుపడుతుంది.

ఇక ప్రమాదకర యాప్ నుంచి మీ ఫోన్ , డేటాలను ఈ ఫీచర్ కాపాడుతుంది. రోజుకు 50 బిలియన్ యాప్ లను స్కాన్ చేస్తూ ఇన్ స్టాల్ చేసుకోని యాప్ లను గూగుల్ ప్లే ఓ కంట కనిపెడుతుంది. హై క్వాలిటీ ఓపెన్ వైఫైకి ఫోన్ ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతుంది.

To Top

Send this to a friend