రేషన్‌ కార్డుదారులకు గుడ్ న్యూస్..!

రేషన్‌ సరుకుల వివరాలను ఎప్పటికప్పుడు ఆహార భద్రతాకార్డుదారులకు తెలియచేసే కార్యక్రమానికి పౌరసరఫరాల శాఖ శ్రీకారం చుట్టింది. గోదాముల నుంచి రేషన్‌ దుకాణాలకు వచ్చిన సరుకుల వివరాలతోపాటు సరుకులు తీసుకున్న వివరాలను కూడా సదరు కార్డుదారుల కు చేరే విధంగా ఎప్పటికప్పుడు సంక్షిప్త సమాచారం అందించేందు కు అధికారులు చర్యలు చేపట్టారు. గతంలోనే ఆహారభద్రతా కార్డుదారుల కుటుంబ సభ్యుల ఆధార్‌ను అనుసంధానం చేసి బయోమెట్రిక్‌ విధానం ద్వారా సరుకులను పంపిణీ చేస్తున్న పౌరసరఫరాల శాఖ ఇటీవల పోర్టబుల్‌ విధానాన్ని కూడా ప్రవేశపెట్టింది. తాజాగా రేషన్‌ దుకాణానికి ఏయే సరుకులు వచ్చాయనే విషయంపై కార్డుదారులకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారాన్ని పంపించనున్నారు. ఈ మేరకు రేషన్‌కార్డుదారుల సెల్‌ఫోన్‌ నెంబర్లను సేకరించి ఆ నెంబర్లకు సమాచారం పంపించే ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యా రు. ఇప్పటి వరకు రేషన్‌దుకాణానికి వెళ్తే బియ్యం ఉంటే కిరోసిన్‌ లేదనీ, కిరోసిన్‌ ఉంటే బియ్యం లేవంటూ డీలర్లు సమాధానం చెప్పేవారు. ఆ పరిస్థితి చెక్‌ చెప్పడానికి అధికారులు కృషి చేస్తున్నారు.

* సెల్‌ఫోన్‌ నెంబర్లకు అనుసంధానం

ఆహారభద్రతకార్డు కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో ఇచ్చిన సెల్‌ నెంబర్లలో సగానికిపైగా సెల్‌ నెంబర్లు పని చేయడం లేదు. దాంతో ప్రస్తుతం పని చేస్తున్న కార్డుదారుల సెల్‌ నెంబర్లను ఈ పీడీఎ్‌సతో అనుసంధానం చేశారు. హైదరాబాద్‌ జిల్లాలో 5.69 లక్షల ఆహారభద్రతాకార్డులు ఉండగా ఆ కార్డుదారులకు చెందిన 3.12 లక్ష ల కార్డులకు చెందిన సెల్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. మిగ తా 2.57 లక్షల మొబైల్‌ నెంబర్లను సేకరించి వాటిని ఈ-పీడీఎ్‌సతో అనుసంధానం చేసేలా చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులు డీలర్లను ఆదేశించారు. ఆహార భద్రతా కార్డుదారులందరి మొబైల్‌ నెంబర్లను సేకరించి వంద శాతం సీడింగ్‌ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నా రు. దీంతో గోదాముల నుంచి చౌక దుకాణానికి సరుకులు చేరగానే స్టాక్‌ వచ్చినట్టు కార్డుదారుల సెల్‌నెంబర్‌కు మెస్సేజ్‌ వస్తుంది. సమాచారం రాగానే వెళ్లి సరుకులు తెచ్చుకునే సౌకర్యం కలగనుంది.

To Top

Send this to a friend