నిరుద్యోగులకు శుభవార్త

అటవీ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీస్‌ విభాగాల్లో ఖాళీగా ఉన్న 2,345 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అటవీ శాఖలో ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్‌–67, ఫారెస్టు సెక్షన్‌ ఆఫీసర్‌–90, ఫారెస్టు బీట్‌ ఆఫీసర్‌–1857 పోస్టులను భర్తీ చేయనుంది. వీటికి ఈనెల 21వ తేదీ నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనుంది.

వైద్య ఆరోగ్య శాఖలో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (స్పెషలిస్టులు)–205, డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ –10, వైద్య విద్యలో ట్యూటర్స్‌– 65, వైద్య విద్యలో లెక్చరర్స్‌ ఇన్‌ రేడియోలాజికల్‌ ఫిజిక్స్‌ అండ్‌ ఫిజిసిస్ట్స్‌– 6, ఇన్సూ్యరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌లో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌–43, అసిస్టెంట్‌ పిజియో థెరపిస్టు–2 పోస్టులను భర్తీ చేయనుంది.

వీటికి ఈనెల 22వ తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనుంది. ఆయా పోస్టులకు సంబంధించిన పూర్తి స్థాయి నోటిఫికేషన్‌ను, పరీక్ష తేదీల వివరాలను తమ వెబ్‌సైట్‌లో పొందవచ్చని టీఎస్‌పీఎస్సీ వివరించింది.

To Top

Send this to a friend