మద్యం తాగితే షుగర్ రాదట..

దేశంలోని అన్ని రాష్ట్రాలకు మద్యం ద్వారానే ఆదాయం వస్తోంది. తెలుగు రాష్ట్రాలకైతే ప్రధాన ఆదాయ వనరు మద్యమే.. పొద్దున, రాత్రి అనే తేడా లేకుండా మద్యం ఏరులై పారుతూనే ఉంది. నిజంగా మద్యం, ధూమపానం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. ఆడ మగ తేడా లేకుండా వీటిని తీసుకుంటూనే ఉంటున్నారు. మద్యం తాగకపోతేనే ఇప్పుడు వింతగా చూసే పరిస్థితి.. కానీ ఇప్పుడో వార్త మద్యం ప్రియులను ఖుషీ చేస్తోంది. మద్యం మితంగా తాగితే మధుమేహం రాదని ఓ పరిశోధన వెల్లడించడం తాజా సంచలనం..

‘మధుమేహం-తరుచూ మద్యం తాగితే ప్రభావం’పై కొన్నేళ్లపాటు డెన్మార్గ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు పరిశోధించారు. మద్యం అస్సలు ముట్టనివారికంటే.. మితంగా వారంలో నాలుగురోజులు తీసుకుంటే మధుమేహం వచ్చే ముప్పు ఉండదని తేల్చారు. ఇందులో 1746 మంది మధుమేహానికి గురయ్యారు. మిగతా వారికి మధుమేహం రాలేదట.. ఆ 1746 మంది మద్యం తీసుకోలేదట.. మిగతా వారు వారంలో నాలుగు సార్లు తీసుకున్నారట..

దీంతో మద్యం తీసుకోని వారితో పోల్చితే.. తీసుకున్న వారికి షుగర్ వ్యాధి రాదని తేల్చారు. మద్యంలో ఉండే పోలిఫెనాల్స్ రక్తంలోని గ్లూకోజ్ సమతుల్యతను పరిరక్షిస్తుండడమే మధుమేహం రాకపోవడానికి కారణమని భావిస్తున్నామని పరిశోధకులు తేల్చారు. సో మందుబాబులు ఇక రెచ్చిపోండి కానీ మితంగా తాగండి.. మధుమేహం రాకుండా కాపాడుకోండి.. ముఖ్యంగా వంశపారంపర్యంగా వచ్చే ఈ షుగర్ వ్యాధి రాకుండా ఉండాలంటే వారి సంతానం ఖచ్చితంగా తక్కువ మోతాదులో మద్యం తాగాల్సిన అవసరం ఉందని ఈ పరిశోధనలో తేల్చారు.

To Top

Send this to a friend