వరుణ్ తేజ్ తో రిస్క్ చేస్తున్న ఘాజీ దర్శకుడు!

మొదటి సినిమానే సాహసం చేసి తీశాడు. ఏ కొత్త దర్శకుడు అలాంటి కథను ఎంచుకోడు.. కానీ ఎంచుకొని అద్భుతంగా తీసి విమర్శకుల ప్రశంసలతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు సంకల్ప్. ఘాజీ సినిమా దేశవ్యాప్తంగా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. రానా సపోర్ట్ తో దర్శకుడు సంకల్ప్ అనుకున్నది అనుకున్నట్టు తీసి శభాష్ అనిపించాడు.

ఇప్పుడు మరోసారి రిస్క్ చేస్తున్నాడు దర్శకుడు సంకల్ప్. ఓ సైన్స్ ఫిక్షన్ కథను ఎంచుకున్నాడట.. భారీ గ్రాఫిక్స్ తో తీస్తున్నాడట.. మామూలు సినిమాలకు భిన్నమైన సినిమా కథను ఎంచుకున్న సంకల్ప్ అందులో హీరోగా మాత్రం ఇప్పుడిప్పుడే సినిమాల్లో విజయాలను అందుకుంటున్న మెగా హీరో వరుణ్ తేజ్ ను ఎన్నుకున్నాడు. ఇంతకుముందటి సినిమాలో రానా నటించడంతో హిందీలో కూడా సినిమా ఆడి డబ్బులు వచ్చాయి. ఇప్పుడు కొత్త హీరో వరుణ్ తో సైన్స్ ఫిక్షన్ చేస్తే మార్కెట్ పరంగా డబ్బులు వస్తాయా రావా అన్నది మీమాంసగా మారింది.

లోఫర్, మిస్టర్ వంటి వరుస ప్లాపులతో సతమతమువుతున్న వరుణ్ తేజ్ కు సంకల్ప్ ఇచ్చిన ఆఫర్ ప్రాణం పోసేదే.. కానీ తన స్థాయికి ఇది పెద్ద కథే.. ఇదివరకే కంచె సినిమాలో అద్బుతంగా నటించిన వరుణ్ కు ఇప్పుడో సంకల్ప్ చెప్పిన కథ సవాలు లాంటిది. ప్రస్తుతం శేఖర్ కమ్ములతో ఫిదా సినిమా చేస్తున్న వరుణ్ ఆ సినిమా పూర్తి కాగానే సంకల్ప్ దర్శకత్వంలో నటిస్తాడట..

To Top

Send this to a friend